కిర్రాక్ ఆర్పీ నీచుడు.. షేకింగ్ శేషు షాకింగ్ కామెంట్!

ప్రస్తుతం జబర్దస్త్ గురించి కిర్రాక్ ఆర్పీ చేసిన సంచలన కామెంట్స్ గురించి ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. జబర్దస్త్ మీద, శ్యామ్ ప్రసాద్ రెడ్డి మీద ఆర్పీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు హోటల్ లో సర్వర్ గా పని చేస్తున్న ఆర్పీ జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. కొంత కాలం తరువాత నాగబాబుతో పాటు జబర్దస్త్ నుండి బయటికి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం కిర్రాక్ ఆర్పీ మా టీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ అనే షో లో చేస్తున్నాడు. అయితే తాజాగా ఇక ఇంటర్వ్యు లో పాల్గొన్న ఆర్పీ జబర్దస్త్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అయితే ఈ వ్యాఖ్యల గురించి క్లారిటీ ఇవ్వటానికి జబర్దస్త్ కమెడియన్స్ ముందుకు వస్తూ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇటీవల హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని జబర్దస్త్ గురించి కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు అన్ని అబద్ధాలే అంటూ కొట్టిపారేశారు. మూడు సంవత్సరాల క్రితం జబర్దస్త్ నుండి బయటికి వచ్చిన ఆర్పీ ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అంటూ రాంప్రసాద్ ప్రశ్నించాడు. ఇక మరొక జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషు కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కిరాక్ ఆర్పీ గురించి సంచలన విషయాలు వెల్లడించాడు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షేకింగ్ శేషు ఆర్పీ గురించి మాట్లాడుతూ ..ఆర్పీ జబర్దస్త్ గురించి చెప్పిన మాటల్లో నిజం లేదని చెప్పుకొచ్చాడు.

జబర్దస్త్ యాజమాన్యం వారు సరైన భోజనం కూడా పెట్టరని ఆర్పి అనటంతో… సరైన భోజనం కూడా పెట్టకపోతే 8 ఏళ్ళు ఎలా అక్కడ పని చేశాడు అంటూ ప్రశ్నించాడు. ఆర్పి సినిమా తీస్తానని చెప్పి తమ ఊరి నుండి ఒక వ్యక్తిని తీసుకువచ్చి సినిమా మొదలు పెట్టకుండానే 20 లక్షలు అతనితో ఖర్చు పెట్టించి అతనిని నిండా ముంచేశాడు అంటూ శేషు చెప్పుకొచ్చాడు. ఈ విషయం గురించి ఫిల్మ్ ఛాంబర్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారని తెలిపారు. అంతే కాకుండా ఆర్పీ వేరే ఎవరో ఇంటిని తన ఇల్లుగా చెప్పి హోం టూర్ చేసి డబ్బులు సంపాదించాడు అంటూ శేషు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆర్పి తనకి అన్నం పెట్టీ మంచి జీవితాన్ని ఇచ్చిన సంస్థ గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు.