Shyamala -Kirak RP: సినీ ఇండస్ట్రీలో నటిగా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్యామల ఇటీవల వైసీపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు అందుకొంటూ పార్టీ కార్యకలాపాలలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా వైసిపి పార్టీలో కీలకంగా కొనసాగుతూ పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తూ వచ్చారు. అయితే తాజాగా వినాయక చవితి పండుగ సందర్భంగా యాంకర్ శ్యామలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇందులో భాగంగా ఆమె వేదికపై నడుచుకుంటూ వెళుతుండగా ఒక వ్యక్తి కర్పూర హారతులు ఇచ్చారు.
ఇక ఈ వీడియోలో శ్యామల తణుకు హారతి ఇస్తున్న నేపథ్యంలో వద్దు అంటూ తల ఊపడమే కాకుండా ఆహారం కళ్ళకు అద్దుక్కున్నారు దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అయింది. ఇక ఈ వీడియో పై జబర్దస్త్ మాజీ కమెడియన్ కిరాక్ ఆర్పీ స్పందిస్తూ చేసిన ఒక వీడియో సంచలనగా మారింది. ఇందులో భాగంగా ఈయన శ్యామలపై సెటైర్లు వేశారు. శ్యామలకు కర్పూర హారతులు ఇచ్చే అంత అభిమానులు కూడా ఉన్నారా అసలు ఆమె రాజకీయాలలో ఏం సాధించిందని హారతులు ఇస్తున్నారు అంటూ ప్రశ్నించారు.
శ్యామలకు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత సినిమాలలో ఏమాత్రం అవకాశాలు లేవు అందుకే వచ్చిన ఈ అవకాశాన్ని చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటూ తన నటనని కనపరిచారని ఆర్పీ సెటైర్లు వేశారు. ఎవరైనా సినిమాలలోకి రావాలనుకున్న లేదంటే యాక్టింగ్ నేర్చుకోవాలన్నా కూడా అందరూ శ్యామలనే ఫాలో కావాలని తెలిపారు. శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యువత ప్రాణాలను తీసినందుకు ఆమెకు హారతులు ఇవ్వాళ అంటూ ప్రశ్నలు వేశారు. వైసీపీలో పెద్ద ఎత్తున శ్యామలకు పోటీ ఏర్పడి ఉంది ఈమెకు పోటీగా విడుదల రజని లక్ష్మీపార్వతి వంటి వారు జగన్మోహన్ రెడ్డి పై కోపంగా ఉన్నారని వీరందరినీ కాదని శ్యామల ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేయడంతోనే ఆమెకు పార్టీలో వ్యతిరేకత ఉంది అంటూ కిరాక్ ఆర్పీ శ్యామల పై విమర్శలు చేస్తూ చేస్తున్న ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

