కార్తీకదీపం సీరియల్ నుంచి తప్పుకోనున్న కీర్తి భట్… కారణం అదేనా?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతూ ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అయితే ఇందులో హిమగా నటిస్తున్న కీర్తి బట్ తప్పుకుంటున్నట్టు తాజా సమాచారం. కీర్తి భట్ ఒక కన్నడ అమ్మాయి. కార్తీకదీపం సీరియల్లో తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శౌర్యకు అక్కగా నటిస్తూ తన కారణంగా తల్లిదండ్రులు చనిపోయారని భావించి ఇంటి నుంచి వెళ్లిపోయిన శౌర్యకు దగ్గర కావాలని చేసే ప్రయత్నాల ద్వారా సాగే ఈ సీరియల్ చాలా ఆకర్షణీయకంగా ఉంటుంది.

ఇలా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి భట్( హిమ) . ఈ సీరియల్ నుండి తప్పుకుంటున్నట్టు తాజా సమాచారం. అయితే ఈ సీరియల్ నుండి తప్పుకోవడానికి కారణాలు ఏంటి అని చాలామంది కామెంట్ ద్వారా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తన సొంత భాష కన్నడలో నటిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ సీరియల్ లో తన పాత్ర కూడా ముగియనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కార్తీకదీపం సీరియల్ ద్వారా కీర్తి భట్ తెలుగు ప్రేక్షకుల హృదయాలను తన నటన ద్వారా దోచుకుంది.

ఈ విధంగా హిమాపాత్రలో లీనమైన నటించిన కీర్తి భట్ ఇక పై ఈ సీరియల్ నుంచి తప్పుకోనందని తనకు కన్నడ సీరియల్ అవకాశం రావడంతోనే ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజ సంబంధం తెలియడం లేదు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ కావడంతో ఈమె అభిమానులు మీరు ఈ సీరియల్ నుంచి తప్పుకోవద్దండి అంటూ కామెంట్లో చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే స్వయంగా నటి కీర్తి స్పందించాల్సి ఉంది.