ఘనంగా భర్తకు పుట్టినరోజు వేడుకలు చేసిన కార్తీకదీపం వంటలక్క.. ఫోటోలు వైరల్!

కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి ప్రేమి విశ్వనాధ్ ఒకరు. ఈమె కేరళ నటి అయినప్పటికీ కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. సాయంత్రం అయితే చాలు ప్రేక్షకులు అందరూ టీవీల ముందు వంటలక్క కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతగా ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న ప్రేమి విశ్వనాథ్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

గత కొద్దిరోజులుగా ఈమె ఆస్తి విషయాల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఈమె కార్తీకదీపం సీరియల్ మాత్రమే కాకుండా ఇతర సీరియల్స్ లో నటించకపోవడానికి గల కారణం తనకు కేరళలో రెండు స్టూడియోలు ఉన్నాయని అక్కడ ఎన్నో సినిమా సీరియల్ షూటింగ్లో జరుపుకోవడమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతూ ఉంటాయని తెలిపారు. ఈ విధంగా ఆ స్టూడియోల వ్యవహారం చూసుకోవడానికి తనకు టైం సరిపోతుందని దీప వెల్లడించారు.

ఇక తన భర్త వినీత్ భట్ గురించి మాట్లాడుతూ తను వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలజర్ అంటూ చెప్పుకొచ్చారు. ఆయనకు ఇదివరకే వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలజర్ అవార్డు కూడా అందుకున్నారని వంటలక్క వెల్లడించారు.ఇకపోతే నవంబర్ 16వ తేదీ తన భర్త పుట్టినరోజు జరుపుకోవడంతో ఈమె ప్రత్యేకంగా తన భర్త పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.ఈ క్రమంలోనే తన భర్త పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అయ్యాయి.