మరోసారి సౌందర్యను మోసం చేసిన ఇంద్రుడు… హాస్పిటల్ నుంచి వెళ్లిపోయిన వంటలక్క!

బుల్లితెరపై అత్యధిక రేటింగ్ సొంతం చేసుకుని ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సీరియల్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే… దీప సౌర్య పోస్టర్ చూపించి ఈ నెంబర్ కి ఫోన్ చేసి సౌర్య గురించి వెతకండి డాక్టర్ బాబు అని చెబుతుంది. ఆ సమయంలో కార్తీక ఫోన్ చేస్తే వాళ్ళు ఆ క్షణంలో ఏమైనా చేయవచ్చు సరాసరి ఈ నెంబర్ తెలుసుకొని వెళ్తాను అంటూ మాటిచ్చాడు. మీకు ఒక విషయం చెబుతాను ఏమీ అనుకోరు కదా.. ఒకవేళ నాకు ఏదైనా అయితే శౌర్య మీ బాధ్యత అంటూ చెప్పడంతో కార్తీక్ అలా మాట్లాడకు దీపా నీకు ఏం కాదు అంటూ భరోసా ఇస్తాడు.

నాకు గతం గుర్తొచ్చిందని చెప్పినా ఆ నిజాన్ని తీసుకోగలిగే శక్తి నీ గుండెకు లేదు దీప అందుకే చెప్పలేకపోతున్నాను అంటూ తనలో తాను బాధ పడుతున్నారు.ఇక నీకోసం మోనిత ఫోన్ చేయలేదా డాక్టర్ బాబు అని అడగక తను ఫోన్ చేసిన నేను లిఫ్ట్ చేయడం లేదు నీకు ఆరోగ్యం బాగా అయ్యేవరకు అలాగే సౌర్య దొరికే వరకు నేను ఇక్కడే ఉంటా అని తనకు భరోసా ఇచ్చారు.

మరోవైపు హిమ ఆనందరావు వెళ్దాం పద సౌందర్య వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కుందాం అంటూ చెప్పగా సౌందర్య ఇంకా రాజమ్మ తనకు ఫోన్ చేయలేదే అనుకుంటూ ఆలోచిస్తుంది. అయితే సౌందర్యనే రాజమ్మకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సరసరీ వారి ఇంటికి వెళ్తుంది.మరోవైపు కార్తీక్ హాస్పిటల్ కి రాగా అక్కడ దీప బెడ్ పై ఉండకపోవడంతో ఎక్కడికి వెళ్లింది అంటూ అంతా వెతికి చివరికి అసలే నీ ఆరోగ్యం బాగాలేదు ఎక్కడికి వెళ్ళిపోయావు దీప అంటూ బాధపడుతుంటారు.

ఇక సౌందర్య వెళ్లి రాజమ్మ గురించి ఆరా తీయగా వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి పోయారని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. దీంతో ఇంద్రుడు తనని మళ్లీ మోసం చేశారని భావించిన సౌందర్య ఆ ఇంటి ఆమెను ఎంత బెదిరించి భయపెట్టిన తాను మాత్రం నిజం చెప్పదు.ఇక వాళ్ళు వెళ్ళగానే ఇంద్రుడికి ఫోన్ చేసి జరిగినది మొత్తం చెప్పగా వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా నువ్వు ఇదే మాట చెబుతుండు అంటూ ఇంద్రుడు చెబుతారు.

మరోవైపు దీప శౌర్య ఫోటో పట్టుకొని శౌర్య కోసం వెతుకుతూ ఉంటుంది. అలాగే సౌర్య కూడా తన బాబాయ్ పిన్నిలను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆమె కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక ఇంద్రుడు ఈ విషయం తెలిసి సౌర్యను బలవంతంగా లాక్కొని ఆటోలో తీసుకు వెళుతుంటారు. అదే సమయంలోనే దీప కళ్ళు తిరిగి రోడ్డు పక్కన పడిపోయి ఉంటుంది. ఈ విధంగా దీప పడిపోవడం చూసి ఆటో డ్రైవర్ ఆటో ఆపుతారు. ఎందుకు ఇక్కడ ఆపావు అని అడగ్గ రోడ్డు పక్కన ఎవరో ఆవిడ పడిపోయింది అంటాడు డ్రైవర్.అది చూసిన ఇంద్రుడు ఒక్కసారిగా షాక్ అవుతారు .అంతలోపు శౌర్య ఎవరు బాబాయ్ అంటే ఎవరూ లేదులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

దీప కోసం కార్తీక్ కంగారుగా ఎక్కడికి వెళ్లిపోయావు దీపా అంటూ వెతుకుతూ ఉంటాడు. మరోవైపు సౌర్య కూడా కార్తీక్ దీప సౌర్యల కోసం వెతుకుతూ ఉంటారు. ఈ విధంగా ఒకరికోసం ఒకరు అదే ప్రాంతంలోనే వెతుకుతూ ఉండటంతో ఈ సీరియల్ పూర్తి అవుతుంది. తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.