జానకి అంటే పోలీస్ డ్రెస్ వేసుకున్న కిరణ్ బేడీ… సునందకు గట్టి వార్నింగ్ ఇచ్చిన జానకి!

జానకి కలగనలేదు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ పొందుతోంది. ఈ క్రమంలోని నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే మల్లికా దొంగ కడుపు నాటకం ఎక్కడ బయట పడుతుందోనని అబార్షన్ అయినట్లు డాక్టర్లతో మాట్లాడి తన కుటుంబాన్ని మొత్తం నమ్మించింది. ఇలా మల్లికకు అబార్షన్ కావడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు.దీంతో జానకి మల్లిక గదిలోకి వెళ్లి మల్లికాకు తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇస్తుంది నిజం చెప్పమంటే ఇలా అందర్నీ బాధ పెడతావా అంటూ వార్నింగ్ ఇవ్వగా నిజం చెబితే అత్తయ్య నన్ను ఇంటి నుంచి బయటకు పంపిస్తారని భయపడి ఈ పని చేశానని చెబుతుంది.

మరోవైపు రామా కూడా మల్లిక కడుపులో బిడ్డ పోయిందని బాధపడుతూ ఉంటారు. ఇక జానకి అక్కడికి రాగానే విష్ణు బాధపడిన విషయాన్ని తన తల్లి బాధపడుతున్న విషయాలను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు.మల్లికా కడుపు విషయంలో తనకు ఏ బాధ లేదని జానకి చెబుతుంది ఎందుకంటే అసలు మల్లిక కడుపుతోనే లేదని జానకి చెప్పడంతో రామా షాక్ అవుతాడు.

నాకు అనుమానం వచ్చి మల్లికను ఫాలో చేసాను దీంతో తనకు కడుపు లేదని బయటపడింది అంటూ రామా చెప్పగా మల్లికా ఇంత నాటకమాడిందా ఇప్పుడే తన సంగతి చెబుతా అంటూ ఆవేశంగా బయటకు వెళ్తుండగా జానకి అడ్డుకుంటుంది. మనం ఇప్పుడు ఈ విషయం అత్తయ్య దగ్గర చెబితే తన కాపురమే పాడవుతుంది. ఇంతటితో వదిలేయండి అని చెబుతుంది.ఇక మాధురి కేసు ఎంతవరకు వచ్చిందని రామా అడగగా త్వరలోనే ఈ కేసు ముగిస్తాను అని జానకి చెబుతుంది.

మరోవైపు పోలీసులు సునంద ఇంటికి వెళ్లి కన్నబాబును అరెస్టు చేయాలని చెబుతారు.జానకి మాధురి తల్లిదండ్రులతో తన కొడుకు పై కంప్లైంట్ ఇప్పించింది అని చెప్పడంతో తను కంప్లైంట్ ఇస్తే మీరు అరెస్టు చేయడానికి వస్తారా అంటూ మండిపడుతుంది.ఇక మాధురి సంఘటన జరిగిన చోట కన్నబాబు ఉంగరం ఉంది అలాగే సంఘటన జరగడానికి కొంత క్షణాల ముందు ఆయన మాధురికి ఫోన్ చేశారని పోలీసులు చెప్పడంతో సునంద షాక్ అవుతుంది.దీంతో కన్నబాబు డ్రైవర్ తన ఫోన్ తనరింగ్ దొంగతనం చేశారని కేసు తన మీద వేసి తనని అరెస్టు చేయాలని చెప్పడంతో పోలీసులు తనని తీసుకెళ్ళిపోతారు.

అదే సమయంలో కన్నబాబు రావడంతో సునంద తనని కొట్టి అసలు విషయం చెబుతుంది మరోవైపు జానకి మాధురి కేసుకు అఖిల్ కి ఏ విధమైనటువంటి సంబంధం లేదని ఇదంతా కన్నబాబు చేశారని చెప్పడంతో సంతోషపడతారు. ఇక జానకి సునంద ఇంటికి వెళ్లి కొడుకుని కాపాడాలని తెగ ట్రై చేస్తున్నారు. ట్రై చేయొద్దని చెబుతుంది జానకి అంటే ఇంట్లో కూరగాయలు కట్ చేసుకునేది మాత్రమే కాదు పోలీస్ డ్రెస్ వేసుకున్న కిరణ్ బేడీ.ఒంటిమీద యూనిఫామ్ లేకపోయినా ఇంత చేశాను ఇక ఆఫీసరు అయితే ప్రతి ఒక్కరి లెక్కలు తేలుస్తా అంటూ తనకు వార్నింగ్ ఇస్తుంది.