రామాతో కలిసి సంతోషంగా గడుపుతున్న జానకి.. జానకిని చూసి మురిసిపోయిన భానుమతి!

కుటుంబ విలువలను ఎంతో గొప్పగా తెలియజేస్తూ కుటుంబ కథా నేపథ్యంలో ప్రేక్షకులను సందడి చేస్తున్న జానకి కలగనలేదు సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… రామ జానకి ఇద్దరు కలిసి కడియసావరంలో ఉన్నటువంటి భానుమతిని చూడడం కోసం వెళ్తూ మధ్య మధ్యలో పొలాల వెంట, పరుగులు పెడుతూ ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు.ఇలా మధ్య మధ్యలో వీరిద్దరూ కలిసి సరదాగా సంతోషంగా వెళుతూ కొట్టారు.

ఒకచోట చింతకాయలు చూసి తనుకు చింతకాయలు కావాలని జానకి అడగ రాళ్లతో చింతకాయలను కొడతాడు. అయితే అది వేరే వాళ్లకు తగలడంతో అక్కడి నుంచి పరుగులు పెడతారు. ఇలా తమ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వీరిద్దరూ ఎంతో సంతోషంగా బయలుదేరుతారు. ఇక కడియాసావరం వెళ్లేసరికి చీకటి పడడంతో రామ పక్కన దాక్కొని ఉంటాడు.

ఇక భానుమతి బయటకు వచ్చి ఎవరమ్మా నువ్వు ఈ వేళలో ఇక్కడికి వచ్చావు ఏం కావాలి నీకు అని అడుగుతుంది. వెనుక నుంచి రామ వింత చేష్టలు చేస్తూ జానకి నవ్విస్తూ ఉంటాడు. ఓ పువ్వుల కోసం వచ్చావా అంటూ భానుమతి జానకిని ప్రశ్నిస్తూ ఉండగా వెనుక నుంచి రామ తనని హత్తుకొని నీ కోడలు బానమ్మ అంటూ తనని పరిచయం చేస్తాడు. ఒకసారిగా రామ తనని చూడటం కోసం రావడంతో భానుమతి ఎంతో సంతోషిస్తుంది.

ఇక జానకి తన కోడలు అని తెలియగానే చూడముచ్చటగా ఉన్నారని చెప్పడమే కాకుండా రామ గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఎమోషనల్ అవుతుంది. ఇల్లు చిన్నదిగా ఉంది అక్కడ ఉన్నన్ని సౌకర్యాలు ఉండవు కాస్త సర్దుకొమ్మని చెప్పగా కొండంత ఈ ప్రేమ ముందు ఆస్తులు అసౌకర్యాలు ఇలాంటివి ఏమీ కనిపించవు అని చెప్పగా భానుమతి కోడలికి ఎంతో కలుపుగోలుతనం ఉంది అంటూ సంతోషపడుతుంది. ఇలా రామా జానకి ఇద్దరిని చూసి భానుమతి సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక మరుసటి రోజు భానుమతి తనకు నీళ్లు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుండగా వెంటనే రామా మేము వెళ్లిపోవాలి అవతల చాలా పనులు ఉన్నాయి అంటూ చెబుతాడు.

రామా ఈ విధంగా చెప్పేసరికి భానుమతి మనసు చిన్న పోతుంది. రాకరాక కోడలితో నన్ను చూడటానికి వస్తే అప్పుడే వెళ్ళిపోతామని చెబుతున్నారు అంటూ బాధపడుతుంది.అయినా ఇప్పుడు స్నానం చేసిన మేము బట్టలు కూడా తెచ్చుకోలేదు చూసి వెళ్ళిపోదామని వచ్చామని చెప్పగా అప్పటికప్పుడు భానుమతి రామా జానకి ఇద్దరికీ కొత్త బట్టలు తెస్తుంది. ఇలా రామా జానకి భానుమతి దగ్గర ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు.