బాలయ్య షోలో జగన్ చెల్లెలు… అద్భుతమైన ప్లాన్ చేసిన ఆహా?

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ వెన్ తెర ప్రేక్షకులను అల్లరించటమే కాకుండా హోస్ట్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నాడు. ఆహా వేదికగా ప్రసారమైన అన్ స్టాపబుల్ సీజన్ 1 లో హోస్ట్ గా వ్యవహరించడంతో ఆశోక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మొదటి సీజన్ మంచి హిట్ అవటంతో ఇటీవల అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ప్రారంభించారు. ఇక ఈ సీజన్ 2 లో కూడా బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తూ మరింత రెట్టింపు ఉత్సాహంతో ఈ షో హిట్ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇటీవల ప్రారంభమైన రెండవ సీజన్లో ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. మొదటి ఎపిసోడ్ లో ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అతని తనయుడు నారా లోకేష్ అతిథులుగా హాజరయ్యారు. మొదటి ఎపిసోడ్ లో తన బావ, అల్లుడితో కలిసి బాలకృష్ణ చేసిన సందడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఈ ఎపిసోడ్ స్ట్రీమ్ అయిన కొన్ని గంటల్లోనే లక్షల సంఖ్యలో వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రెండవ ఎపిసోడ్లో యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ అతిథులుగా హాజరయ్యారు. వీరిద్దరితో కలిసి బాలకృష్ణ చేసిన రచ్చ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక తాజాగా మూడవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ మూడవ ఎపిసోడ్ లో యువ హీరోలు శర్వానంద్, అడవి శేషు అతిథులుగా హాజరుకానున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో కూడా బాలకృష్ణ ఆ ఇద్దరి హీరోలను ముప్పతిప్పలు పెట్టి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాకుండా వారితో కలిసి డాన్స్ చేస్తూ సందడి చేశాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాలుగవ ఎపిసోడ్ కి సంబంధించిన గెస్ట్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది. ఈ నాలుగవ ఎపిసోడ్లో దగ్గుబాటి వెంకటేష్ గెస్ట్ గా హాజరుకానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుండగా… తాజాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కూడా ఈ షోలో పాల్గొనన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ వార్తలలో ఇంతవరకు నిజం ఉందో తెలియడం లేదు.