‎Genelia: ఆహా సింగింగ్ షోలో మెరిసిన జెనీలియా.. వీడియో వైరల్!

‎Genelia: జెనీలియా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా బొమ్మరిల్లు. టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు విడుదల అయిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ ఒక్క సినిమాతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది జెనీలియా. ఇందులో హాసిని పాత్రలో నటించింది.

‎చాలా మంది ఈమెను ముద్దుగా హాసిని అనికూడా పిలిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే జెనిలియా ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో మాత్రమే నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ జెనీలియా ఆహా సిగింగ్ షోలో మెరిసింది. తెలుగు ఓటీటీ ఆహా కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆహా సూపర్ హిట్ సింగింగ్ షో తెలుగు ఇండియన్ ఐడల్ చేస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి అవ్వగా తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ ఇటీవలే మొదలైంది.



‎ ప్రస్తుతం నాలుగో సీజన్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి. ఆహా షోలలో అప్పుడప్పుడు సెలబ్రిటీలు వచ్చి సందడి చేస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ షోకి హీరోయిన్ జెనీలియా వచ్చి సందడి చేసింది. ఎపిసోడ్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ తమ పాటలతో జెనీలియాకు మెప్పించారు. త్వరలోనే జెనీలియా వచ్చిన ప్రోమో, ఎపిసోడ్ రిలీజ్ చేయనున్నారు. ప్రతి శుక్ర, శని వారాలు కొత్త ఎపిసోడ్స్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఈ తెలుగు ఇండియన్ ఐడల్ షోలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, గాయకులు కార్తీక్, గీతా మాధురి జడ్జెస్ గా ఉండగా శ్రీరామచంద్ర తో పాటు సమీరా భరద్వాజ్ హోస్ట్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్రస్తుతం జెనీలియా హాజరైన ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి.