జబర్దస్త్ కొత్త యాంకర్ కూడా మొదలెట్టిందిగా.. రీల్స్ తో సందడి చేస్తున్న సౌమ్య రావు?

జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాల్సిన పనిలేదు.ఇదివరకు అనసూయ జబర్దస్త్ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేది అయితే ఈ కార్యక్రమం నుంచి ఈమె తప్పుకోవడంతో కొద్దిరోజుల పాటు రష్మీ ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సౌమ్యరావు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈమె వచ్చి రెండు వారాలు కూడా పూర్తికాకుండానే పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.

ఈమె జబర్దస్త్ యాంకర్ గా పరిచయం కాకముందు వరకు చాలామందికి సౌమ్యరావు అంటే ఎవరు అనేది తెలియదు. బుల్లితెర సీరియల్స్ లో నటించినప్పటికీ జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వచ్చిన తర్వాత ఈమె అందరికీ పరిచయమయ్యారు.ఇలా వచ్చి రాగానే జబర్దస్త్ కమెడియన్లకు తనదైన స్టైల్ లో పంచ్ డైలాగులు వేస్తూ ఈమె తన మార్క్ ఏంటో చూపించారు. ఇలా రెండు వారాలు కూడా పూర్తిగా కాకుండానే సౌమ్యరావు సైతం సోషల్ మీడియాలో తన హంగామా మొదలుపెట్టింది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా రీల్స్ చేస్తూ వీడియోలను షేర్ చేయడంతో ఒకసారిగా ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అనసూయ అంతా చేయకపోయినప్పటికీ ఈమె కూడా కుర్రకారులను ఆకట్టుకోవడం కోసం పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈమె పెర్ఫార్మెన్స్ కు ఫిదా అవుతున్నారు.