కాస్ట్లీ కారు కొన్న జబర్దస్త్ లేడీ ఆర్టిస్ట్…వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా గుర్తింపు పొంది ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలు అందుకుంటున్నారు. తినటానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న ఎంతోమందిని మల్లెమాల ఆదరించి జబర్దస్త్ లో అవకాశం కల్పించడమే కాకుండా వారికి మంచి రెమ్యూనరేషన్ ఇస్తూ ఆర్థికంగా కూడా ఎదిగేలా చేసింది. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొంది ఫేమస్ అయిన ఆర్టిస్టులలో పవిత్ర కూడా ఒకరు.

ప్రస్తుతం కొనసాగుతున్న జబర్దస్త్ షోలో పవిత్ర లేడీ కమెడియన్గా మంచి గుర్తింపు పొందింది. పొట్టిగా ఉన్న పవిత్ర తనమీద తానే సెటైర్లు వేసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన పవిత్ర శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా సందడి చేస్తోంది. అంతేకాకుండా అప్పుడప్పుడు మల్లెమాలవారు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ఉంటుంది.

ఇలా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో సందడి చేస్తున్న పవిత్ర మల్లెమాల వారి నుండి అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పవిత్ర ఇటీవల పండగ సందర్భంగా కొత్త కారు కొని అందరిని సర్ప్రైజ్ చేసింది. తన కొత్త కారు కి సంబంధించిన వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసింది. హ్యుందాయ్ ఐ20 మోడల్ కారును పవిత్ర కొనుగోలు చేసింది. ప్రస్తుతం పవిత్ర కొత్తకారికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.