Hyper Aadi : చివరికి పవిత్ర నరేష్ ను కూడ వదల్లేదుగా…?

Hyper Aadi: హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన ఆది సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకున్నాడు. మొదట జబర్థస్త్ లో కంటెంట్ రైటర్ గా పని చేసిన ఆది తన ప్రతిభతో అతి తక్కువ కాలంలోనే టీం లీడర్ గా ఎదిగాడు. ఆది టీమ్ లీడర్ అయిన తర్వాత జబర్థస్త్ రేటింగ్స్ మరింత పెరిగాయని చెప్పటంలో సందేహం లేదు. జబర్దస్త్ ద్వారా తన పంచులతో, కామెడీ టైమింగ్ తో ఫేమస్ అయిన ఆది ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా సందడి చేస్తున్నాడు. అంతే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న స్పెషల్ ఈవెంట్స్ లో కూడా ఆది సందడి మామూలుగా ఉండదు.

అయితే ఆది కొన్ని రోజులుగా జబర్దస్త్ లో కనిపించడం లేదు. రెమ్యూనరేషన్ విషయంలో మల్లెమాల వారీతో గొడవ కారణంగా ఆది జబర్థస్త్ మానేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆది ప్రస్తుతము ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో లో కొనసాగుతున్నాడు. అందువల్ల మల్లెమాల వారుతో ఆదికి ఎటువంటి గొడవలు లేవని కొందరూ వెల్లడిస్తున్నారు. అంతే కాకుండా ఇటీవల జబర్దస్త్ గురించి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి ఆర్పీ చేసిన వ్యాఖ్యలను కూడా ఆది ఖండించాడు. ఇదిలా ఉండగా ఆది ఇటీవల శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఈ ఆదివారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఆది నటుడు నరేష్ పవిత్ర లోకేష్ గురించి కామెంట్ చేశాడు. దాదాపుగా నెల రోజుల నుండి నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆది ఎక్కువగా ట్రెండ్‌లో ఉన్న టాపిక్స్ మీద కౌంటర్లు వేస్తుంటాడు. ఈ క్రమంలో నరేశ్, పవిత్రా లోకేశ్ గురించి కూడా సెటైర్లు వేసాడు.ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోరూమ్ పొట్టి నరేశ్, పవిత్ర పిలిచి వారి పేర్లు అడిగాడు. రాంప్రసాద్ కి హైపర్ ఆదికి మధ్య క్యాలెండర్ విషయంలో గొడవ రావటంతో అందరూ జంటలుగా వచ్చి సపోర్ట్ చేశారు. ఈ క్రమంలో నరేశ్ కి జోడిగా పవిత్ర వచ్చింది. అప్పుడు ఆది పవిత్రని నీ పేరేంటి అని అడిగితే పవిత్ర అని సమధానం చెబుతుంది. తర్వాత వాడి పేరేంటి అని అడిగితే నరేశ్ అని చెబుతుంది. వెంటనే ఆది సరిపోయింది అంటూ సైలెంట్ గా ఉండిపోతాడు. దీంతో అక్కడున్న వారికి ఏమి అర్థం కాలేదు. అప్పుడు పంచ్ ప్రసాద్ నరేశ్ పవిత్ర గురించి అనగానే అందరూ ఒక్కసారిగ నవ్వారు.