నందమూరి బాలకృష్ణ బ్యాడ్ టచ్.! ఇలా చేశావేంది బాలయ్యా.!

‘భగవంత్ కేసరి’ సినిమాలో నందమూరి బాలకృష్ణ నీతులు చెప్పారు.! గుడ్ టచ్ అలాగే బ్యాడ్ టచ్ గురించి గొప్పగా వివరించారు.! కానీ, సినిమా వేరు.. రియల్ లైఫ్ వేరు.! తన సినిమాలో నటించిన ఓ నటితో అసభ్యకరంగా నందమూరి బాలకృష్ణ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

చాలాకాలం క్రితం సంఘటన ఇది. బాధిత మహిళ తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకుని కంటతడి పెట్టింది. దానికి కారణం నందమూరి బాలకృష్ణేనని అంటోందామె. ఆమె పేరు పవిత్ర. పలు తమిళ సినిమాల్లో నటించింది. తెలుగులో ‘భలే వాడివి బాసూ’ అనే సినిమాలో నటించింది. బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా అది.

‘నన్ను ఆయన తన రూమ్‌లోకి రమ్మన్నాడు. వెళ్ళలేదని నన్ను వేధించేవారు.. సెట్‌లో కొందరు నాతో అసభ్యకరంగా ప్రవర్తించేలా చేశాడు..’ అంటూ బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండానే, ఆయన మీద తీవ్ర ఆరోపణలు చేసింది పవిత్ర.

సరే, ఈ తరహా ఆరోపణల్ని ఎంతవరకు నమ్మాలి.? అన్నది వేరే చర్చ. కొందరు, పబ్లిసిటీ కోసం ఇలాంటి బురద చల్లడం ఇటీవలి కాలంలో చాలాసార్లు చూశాం కూడా. అయితే, బాలయ్య వ్యవహార శైలి పలు సందర్భాల్లో వివాదాస్పదమయ్యింది.

ఓ సినీ వేదికపై మాట్లాడుతూ, ‘నా అభిమానులు అంటే ఎలా వుంటారో తెలుసా.? అమ్మాయి కనిపిస్తే ముద్దయినా పెట్టేయాలి, కడుపు అయినా చేసెయ్యాలి..’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను వివాదాన్ని రాజేసిన సంగతి తెలిసిందే.

ఆనాటి ఆ వివాదాన్ని పరిగణనలోకి తీసుకుంటే, విచిత్ర చేసిన వ్యాఖ్యలూ నిజమేనని అనిపించడం సబబే కదా.! బాలయ్య ఓ సాధారణ సినీ నటుడు కాదు, స్టార్ హీరో. పైగా, ఓ రాజకీయ పార్టీలో వున్నారు. ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు కూడా.!