యూట్యూబ్ లో జబర్దస్త్ హడావిడి.. మళ్ళీ పూర్వ వైభవం రానుందా..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి తెలియని వారంటూ ఉండరు. 2013లో ప్రారంభమైన ఈ కామెడీ షో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి గత తొమ్మిది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతూనే ప్రేక్షకులను అలరిస్తోంది. మొదట ఈ కామెడీ షో కి నాగబాబు రోజా జడ్జెస్ గా ఉన్నారు. ఆరు సంవత్సరాలు జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరించిన నాగబాబు అక్కడి యాజమాన్యంతో మనస్పర్ధలు కారణంగా జబర్దస్త్ కు దూరమయ్యారు. ఆయనతో పాటు మరి కొంతమంది ఫేమస్ కమెడియన్లు కూడా ఆ సమయంలో జబర్దస్త్ నుండి వెళ్లిపోయారు. దీంతో ఆ సమయంలో జబర్దస్త్ రేటింగ్స్ కొంత వెనుకబడ్డాయి.

తర్వాత హైపర్ ఆది సుడిగాలి సుదీర్ వంటి వారు తమ స్కిట్లతో జబర్దస్త్ ని మళ్ళీ ఒక రేంజ్ కి తీసుకెళ్లారు. దీంతో జబర్దస్త్ రేటింగ్స్ కూడా పెరిగాయి. అయితే గత కొంతకాలంగా జబర్దస్త్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎంతోకాలంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న ఈ కామెడీ షో కి ఇప్పుడు కల లేకుండా పోయింది. జబర్దస్త్ నుండి హైపర్ ఆది సుధీర్ అభి గెటప్ శ్రీను వంటి ఫేమస్ కమెడియన్లు బయటికి జబర్దస్త్ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపటం లేదు దీంతో జబర్దస్త్ రేటింగ్స్ కూడా చాలా దారుణంగా పడిపోయాయి. అయినప్పటికీ జబర్దస్త్ యాజమాన్యం వారు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ జబర్దస్త్ ముందుకు నడిపిస్తున్నారు.

ఈ క్రమంలో ఇటీవల జబర్దస్త్ గురించి జబర్దస్త్ యాజమాన్యం గురించి కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ నుండి బయటికి వచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు జబర్దస్త్ షో గురించి అక్కడ యాజమాన్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. జబర్దస్త్ లో ఆర్టిస్టుల టాలెంట్ ని వాడుకొని వారికి అన్యాయం చేస్తున్నారని, అక్కడ పనిచేసే వారికి సరైన భోజనం కూడా పెట్టరు అంటూ వెల్లడించాడు. అంతే కాకుండా తమ టాలెంట్ వాడుకొని శ్యామ్ ప్రసాద్ రెడ్డి కోట్ల రూపాయలు సంపాదిస్తూ కష్టాలలో ఉన్న వారికి సహాయం కూడా చేయరని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఎంతో మంది జబర్దస్త్ ఆర్టిస్టులు ఈ విషయం గురించి స్పందిస్తూ ఇంటర్వ్యు లు ఇచ్చారు.

దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా జబర్దస్త్ గురించే చర్చ జరుగుతోంది. యూట్యూబ్లో జబర్దస్త్ గురించి జరుగుతున్న చర్చ వల్ల ఈ కామెడీ షోపై ప్రేక్షకులలో మళ్లీ అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ప్రేక్షకుల అంచనాలకు చేరువయ్యేల కామెడీ చేస్తే జబర్దస్త్ కి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పది, పదకొండు రేటింగ్స్ తో నంబర్ వన్ గా దూసుకుపోతున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం రేటింగ్స్ అమాంతం తగ్గిపోయాయి. దీంతో తిరిగి ఈ కార్యక్రమం ముందులా రేటింగ్స్ సంపాదించుకుంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.