బుల్లితెర సెలబ్రిటీలలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన జబర్దస్త్ కమెడియన్.. మరి సుమ స్థానం ఏంటి..?

బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన సుమ బుల్లితెర మహారాణిగా ఫేమస్ అయ్యింది. ఇలా యాంకర్ గా ఫేమస్ సుమ అవ్వగా కమెడియన్ గా సుధీర్ ఫేమస్ అయ్యాడు. ఈటీవీలో ప్రసారమాతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుధీర్ ఆ షోలో తన కామెడీతో ప్రేక్షకుల్ని నవ్విస్తూ టీం లీడర్ గా ఎదిగాడు. ఆ తర్వాత గెటప్ శ్రీను ఆటో రాంప్రసాద్ తో కలిసి ఒక టీం గా ఏర్పడి జబర్దస్త్ లో నవ్వులు పూయిస్తున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా కమీడియన్ గా మంచి గుర్తింపు పొందిన సుధీర్ సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకున్నాడు.

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఓరామాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీ ర్యాంక్స్ లలో ఐదు మంది టాప్ టీవీ సెలబ్రిటీల మంచి గుర్తింపు పొందినట్లు సమాచారం. ఈ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీ ర్యాంక్స్ లో సుధీర్ మొదటి స్థానంలో నిలిచాడు. జబర్థస్త్, ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ కంపెనీ వంటి కామెడీ షోలతో కమెడియన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సుధీర్.. సూపర్ సింగర్ జూనియర్స్ షో లో యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు పొందాడు.

ఇక ఈ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీ ర్యాంక్స్ లో సుధీర్ తర్వాత హైపర్ ఆది రెండవ స్థానం దక్కించుకున్నాడు. జబర్థస్త్, ఢీ షోలలో తన పంచూలతో, సెటైర్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ఆది.. కమెడియన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాలలో నటించాడు. కామెడీ షోలు సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందిన ఆది రెండవ స్థానంలో నిలిచాడు.

ఇక ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా కొనసాగుతూ బుల్లితెర మహారాణిగా గుర్తింపు పొందిన సుమ ఈ ర్యాంక్స్ లో మూడవ స్థానంలో నిలువగా… చలాకి చంటి నాలుగవ స్థానం కైవసం చేసుకున్నాడు. అలాగే గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మీ ఈ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీ ర్యాంక్స్ లో ఐదవ స్థానంలో నిలిచింది. ఇలా సుడిగాలి సుధీర్ నెంబర్ వన్ స్థానంలో ఉండడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం.