Jabardasth Comedian: జబర్దస్త్ కామెడీ షో గురించి మనందరికీ తెలిసిందే. కొన్ని ఏళ్లుగా సక్సెస్ఫుల్గా ప్రసారమవుతూ లక్షలాది మందిని కడుపుబ్బా నవ్విస్తూ దూసుకుపోతోంది ఈ షో. కాగా ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు నటులు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చాలామంది కమెడియన్లు వెండితెరపై కూడా అవకాశాలను అందుకున్నారు. అలాగే చాలామంది సెలబ్రిటీ హోదాను కూడా దక్కించుకున్నారు.
అయితే జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కమెడియన్ రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. మొదట్లో ధనరాజ్,వెంకీ, చమ్మక్ చంద్ర వంటి కమెడియన్ల కిట్లలో చేసిన రాకింగ్ రాకేష్ ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగిన తర్వాత చిన్న పిల్లలతో స్కిట్లు చేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల తర్వాత చిన్న పిల్లలతో కాకుండా పెద్దవారితో కామెడీ చేస్తూ ప్రేక్షకులను బాగానే నవ్వించారు. ఈ నేపథ్యంలోనే జోర్దార్ సుజాతతో కలిసి కొన్ని స్కిట్లు చేశారు. వీరిద్దరి కామెడీ టైమింగ్,, జోడి కూడా బాగా సెట్ అవ్వడంతో అలా వీరిద్దరి మధ్య ప్రేమ కూడా మొదలైంది.
అలా ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్లిన విషయం తెలిసిందే. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఒక పాప కూడా జన్మించింది. అలా జబర్దస్త్ తో పాటు చాలా షోలలో వీరిద్దరూ కలసి కామెడీ చేస్తూ సందడి చేశారు. పెళ్లి అయిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే. అయితే పాప పుట్టినా తర్వాత రాకింగ్ రాకేష్ ఇప్పటివరకు ఆ చిన్నారి ఫేస్ ని రివిల్ చేయలేదు. బయట ఎక్కడ కనిపించినా కూడా పాప ఫేస్ ని కవర్ చేస్తూ వచ్చారు. కానీ నేడు ఫాదర్స్ డే సందర్భంగా అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు రాకింగ్ రాకేష్. అదేమిటంటే ఫాదర్స్ డే సందర్భంగా కూతురి ఫేస్ ని మొదటిసారి రివీల్ చేశాడు. ప్రస్తుతం రాకేష్ ఫ్యామిలీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తల్లి తండ్రికి తగ్గట్టుగానే ఆ చిన్నారి కూడా చాలా క్యూట్ గా తెల్లగా చాలా అందంగా ఉంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కూడా పాప చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.