Jabardasth Comedian: జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో మొదట్లో కేవలం మగవారు మాత్రమే పాల్గొని ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేసేవారు. అయితే మగవారే లేడీ గెటప్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేసేవారు ప్రస్తుతం ఈ కార్యక్రమంలో లేడి కమెడియన్స్ కూడా ఎంతోమంది ఉన్నారు.ఇక ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న కమెడియన్ తన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన్మయి తన తల్లితో కలిసి క్యాష్ కార్యక్రమానికి వచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తన్మయి తన గురించి ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక నిజాన్ని బయటపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన్మయి మాట్లాడుతూ నాకు నా తల్లిదండ్రులు అబ్బాయిగా జన్మనిచ్చారు. కానీ నేను ట్రాన్స్ జెండర్ గా మారిపోయానని తెలియజేశారు. అయితే అబ్బాయిగా పుట్టిన తనకు తన శరీరంలో హార్మోనుల అసమతుల్యత వల్ల అమ్మాయి లక్షణాలు వచ్చాయని ఎన్నో హాస్పిటల్స్ లో చూపించుకున్నప్పటికీ ఫలితం లేదని అందుకే తను ట్రాన్స్ జెండర్ గా మారాల్సి వచ్చిందని ఈ విషయంలో తన తల్లిదండ్రులను మోసం చేసినందుకు బాధపడుతున్నట్లు తెలిపారు.
ఇక తను అమ్మాయి అని చెబితే ఎక్కడ అవకాశం రాదు అని జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చిన మొదట్లో అబ్బాయి అని చెప్పుకున్నానని ఈ విధంగా అమ్మాయి అని చెబితే బయట తల్లిదండ్రులకు ఏమాత్రం గౌరవం ఉండదని ఈ విషయాన్ని తనలో తానే దాచుకున్నట్లు తెలిపారు.ఇక ఈ విధంగా తన్మయి తన గురించి మాట్లాడటంతో తన తల్లి స్పందిస్తూ… బయట ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నాకు నా బిడ్డ ముఖ్యమంటూ వీరిద్దరూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.