Jabardasth Comedian: ఘనంగా కూతురికి అన్నప్రాసన వేడుక నిర్వహించిన జబర్దస్త్ కమెడియన్.. ఫోటోస్ వైరల్!

Jabardasth Comedian: తెలుగు బుల్లితెరపై ఎప్పటి నుంచో ప్రసారం అవుతున్న కామెడీ షో జబర్దస్త్. ప్రతి గురు శుక్రవారాలలో జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ ప్రసారమవుతూ లక్షలాదిమందిని కడుపుబ్బా నవ్విస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ద్వారా ఇప్పటికే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి కూడా పరిచయమయ్యారు. చాలామంది లేడీ అలాగే జెంట్స్ కమెడియన్స్ కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. చాలామంది జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీ హోదాను కూడా దక్కించుకున్నారు.

అలా జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లు చేసి కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. జబర్దస్త్ అలాగే ఎక్స్ట్రా జబర్దస్త్ లో చాలా స్కిట్లు చేసి తన కామెడీతో కడుపుబ్బ నవ్వించారు రాకేష్. వీటితోపాటు బుల్లితెరపై ప్రసారమయ్యే ఇంకా కొన్ని కామెడీ షోలలో కూడా కామెడీ చేసిన విషయం తెలిసిందే. ఇలా బుల్లితెరపై కామెడీ చేస్తున్న నేపథ్యంలోనే ఇతనికి జోర్దార్ సుజాతతో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరికి కాంబోలో ఎన్నో స్కిట్లు కూడా వచ్చాయి. అలా వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికూడా చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ దంపతులకు ఒక పాప కూడా జన్మించింది. అయితే కూతురు పుట్టిన తర్వాత చాలా సందర్భాలలో బయట కనిపించినప్పటికీ ఎప్పటికప్పుడు కూతురు ఫేస్ ని దాచి పెడుతూ వచ్చారు. ఇటీవలే ఫాదర్స్ డే సందర్భంగా కూతురు పేస్ ని రివిల్ చేశారు రాకేష్ దంపతులు. ఇది ఇలా ఉంటే తాజాగా రాకేష్ సుజాత దంపతులు కూతురుకి అన్నప్రాసన వేడుకను నిర్వహించారు. ఈ చిన్నారి పేరు ఖ్యాతిక. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.