Jabardasth Comedian: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఎంతోమంది ఒకప్పుడు ఎన్నో అవమానులను కష్టాలను ఎదుర్కొన్నవారే. జబర్దస్త్ షోలో రాణిస్తున్న కమెడియన్లు కూడా తెరవెనుక ఎన్నో కష్టాలను పడ్డారు. వారిలో ఇప్పటికీ కొంతమంది కష్టాలను అనుభవిస్తూనే ఉన్నారు. కెరియర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలను అనుభవించి ఆ తర్వాత అవకాశాలు అందుకుని సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే జబర్దస్త్ కమెడియన్ కూడా ఒకరు. జబర్దస్త్ షో ద్వారా బోలెడంత పాపులారిటి సంపాదించుకున్న ఈ కమెడియన్ ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో పాల్గొని తనదైన శైలిలో నవ్విస్తూ భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇంతకీ ఆ కమెడియన్ మరెవరో కాదు ఇమ్మానుయేల్. జబర్దస్త్ తర్వాత ఇప్పుడు కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో పాల్గొంటున్నాడు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఇమ్మానుయేల్ తన కష్టాలను గుర్తు చేసుకుంటూ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్మానుయేల్. కాగా ఆ ప్రోమోలో ఇమ్మాన్యూల్ మాట్లాడుతూ.. నాకు మా ఊరంటే చాలా చాలా ఇష్టం.. మా ఊరి పేరు వైకుంఠపురం. నా డిగ్రీ అయిపోయిన తర్వాత దాదాపు నేను ఒక ఏడు నెలలు తాపీ పనికి వెళ్లాను. బొచ్చలు మోయడానికి కూడా వెళ్ళాను. సిమెంట్ బొచ్చలు మోయడం వల్ల వేళ్లన్ని బొక్కలు పడితే ఏడ్చేసేవాడిని మా అమ్మ దగ్గర.
వర్షం పడితే నన్ను మా అన్నని పడుకోబెట్టి మా అమ్మనాన్న గోనె సంచులు పట్టుకొని కూర్చునేవాళ్లు. ఆ టైమ్ లో మాకు ఎవరూ హెల్ప్ చేయలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్మాన్యూల్. అయితే ఇమ్మానుయేల్ కన్నీళ్లు పెట్టుకోవడంతో అక్కడున్న వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. శ్రీముఖి వెంటనే ఇమ్మానుయేల్ కి ధైర్యం చెబుతూ ఓదార్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.