జబర్దస్త్ కొత్త జడ్జ్ కృష్ణ భగవాన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రసారమవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన ప్రముఖ కమెడియన్లు జడ్జిలు జబర్దస్త్ కి దూరమయ్యారు. ఈ క్రమంలో జబర్దస్త్ లో ఎన్నో ఏళ్లుగా జడ్జిలుగా వ్యవహరిస్తున్న రోజా, నాగబాబు కూడా జబర్దస్త్ కి దూరమయ్యారు. నాలుగు సంవత్సరాల క్రితం నాగబాబు జబర్దస్త్ కి దూరం కాగా.. కొన్ని నెలల క్రితం మంత్రి పదవి దక్కటంతో రోజా కూడా జబర్దస్త్ జడ్జ్ పోస్ట్ కి రాజీనామా చేసింది.

ఇక నాగబాబు వెళ్లిన తర్వాత సింగర్ మనో జబర్దస్త్ లో అప్పుడప్పుడు జడ్జిగా సందడి చేస్తున్నాడు. ఇక రోజా స్థానంలో హీరోయిన్ ఇంద్రజ పర్మినెంట్ జడ్జిగా మారిపోయింది. అయితే సింగర్ మనో ఇతర షోస్ లో కూడా చేయటం వల్ల జబర్దస్త్ కి డేట్స్ కేటాయించలేకపోతున్నాడు. అందువల్ల కమీడియన్ గా మంచి గుర్తింపు పొందిన కృష్ణ భగవాన్ ని మల్లెమాలవారు జబర్దస్త్ కి జడ్జ్ గా ఆహ్వానించారు. ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరమైన కృష్ణ భగవాన్ బుల్లితెర మీద సందడి చేస్తున్నాడు.

సినిమాలలో అవకాశాలు తగ్గటంతో అప్పుడప్పుడు బుల్లితెర మీద ప్రసారం అవుతున్న టీవీ షోస్ లో సందడి చేస్తున్న కృష్ణ భగవాన్ కి మల్లెమాలవారు జబర్దస్త్ జడ్జిగా ఆఫర్ ఇచ్చారు. ఇక ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్లలో జడ్జిగా వ్యవహరించిన కృష్ణ భగవాన్ కమెడియన్ అవటం వల్ల అక్కడ కమెడియన్ల మీద రివర్స్ పంచులు వేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు. దీంతో కృష్ణ భగవాన్ ని జబర్దస్త్ కి పర్మనెంట్ జడ్జిగా ఉంచనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ షో కోసం మల్లెమాలవారు కృష్ణ భగవాన్ కి ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. జబర్దస్త్ లో ఒక ఎపిసోడ్ కి గాను కృష్ణ భగవాన్ కి దాదాపు రూ.1.6 లక్షల నుంచి రూ.1.75 లక్షల పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం.