పరోక్షంగా ప్రగతిపై సెటైర్స్ వేసిన జబర్దస్త్ కమెడియన్స్.. షాక్ అయిన ప్రగతి!

ఎన్నో తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏంటో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రగతి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ జిమ్ వీడియోలతో పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. నాలుగు పదుల వయసులో కూడా ఈమె భారీ మొత్తంలో వర్క్ అవుట్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఇలా ప్రగతి ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఫిట్నెస్ గురించి అలాగే మోడ్రన్ డ్రెస్సులలో ఫోటోలకు ఫోజులిస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఈ మధ్యకాలంలో బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు.ఇప్పటికే శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమంలో సందడి చేసిన ప్రగతి తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి కూడా జడ్జిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చేవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ ప్రోమోలో భాగంగా రాకెట్ రాఘవ ప్రగతిని ఉద్దేశించి తన స్కిట్ చేశారు.

ఈ విధంగా రాకెట్ రాఘవ ప్రగతిని ఉద్దేశించి వర్కౌట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇలా వర్క్ అవుట్ చేసి బాగా అలసిపోవడంతో పక్కనే ఉన్న వ్యక్తి అందుకే ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలని చెప్పేది అంటూ పంచ్ వేస్తాడు.దీంతో రాకెట్ రాఘవ వెంటనే ఏంటి ప్రగతి గారిని అంత మాట అన్నావు అని అనగానే వెంటనే పక్కనున్న వ్యక్తి నేను అన్నది ఆవిడని కాదు మిమ్మల్ని అంటూ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వైరల్ గా మారింది.