జబర్దస్త్ లో టీమ్ లీడర్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన జబర్దస్త్ ఆర్టిస్ట్..?

ఈటీవీలో గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి ప్రేక్షకులలో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమీడియన్లుగా మంచి గుర్తింపు పొంది సినిమాలలో నటించే అవకాశాలు అందుకున్నారు. ఇలా ఎంతోమంది టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చిన ఈ కామెడీ షో ఇప్పుడు నంబర్ వన్ కామెడీ షో గా గుర్తింపు పొందింది. అయితే తమకి గుర్తింపు ఇచ్చిన జబర్దస్త్ కామెడీ షో ని వదిలి కొంతమంది కమెడియన్లు సినిమా అవకాశాల కోసం వెళ్తుంటే మరి కొంతమంది ఆర్టిస్టులను మాత్రం జబర్దస్త్ యాజమాన్యం తొలగించటం వల్ల వారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇలా జబర్దస్త్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన ఆనంద్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ షో గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. చమ్మక్ చంద్ర స్కిట్ లో నటించి మంచి గుర్తింపు పొందిన ఆనంద్ చమ్మక్ చంద్ర జబర్దస్త్ కి దూరమైన తర్వాత టీం లీడర్ గా మారాడు. అయితే టీం లీడర్ గా అతను చేసే స్కిట్లకి మంచి రేటింగ్స్ రాకపోవడంతో టీం లీడర్ గా తీసేసి కంటెంట్ గా పెట్టారు. అయితే ఇతర టీం లీడర్లు కూడా వారి స్కిట్లలో కంటెస్టెంట్ గా ఆనంద్ ని తీసుకోకపోవడంతో అతను ఖాళీగా ఉండలేక అవకాశాల కోసం జబర్దస్త్ నుండి బయటికి వచ్చాడు. ఇలా జబర్దస్త్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఆనంద్ అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడినట్లు ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ఇక ఈ ఇంటర్వ్యూలో జబర్దస్త్ టీం లీడర్ల రెమ్యూనరేషన్ గురించి ఆనంద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో ఆనంద్ మాట్లాడుతూ.. టీం లీడర్లు వేసే స్కిట్ కి వచ్చే రేటింగ్స్ ని బట్టి టీం లీడర్ల రెమ్యూనరేషన్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇలా చమ్మక్ చంద్ర, సుధీర్ వంటి వారికి లక్షల్లో రెమ్యూనరేషన్ ఉంటుందని.. ఇక వారి టీం లో పనిచేసే కంటెస్టెంట్లకి 10 నుండి 20వేల వరకు రెమ్యూనరేషన్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక జబర్దస్త్ లోకి అడుగుపెట్టిన మొదట్లో కేవలం వేయి రూపాయలు మాత్రమే రెమ్యూనరేషన్ ఇచ్చేవారని చమ్మక్ చంద్ర టీం లో తనకు ఒక స్కిట్ కి 15000 వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వెల్లడించాడు. ఇలా టీం లీడర్లకి కంటెస్టెంట్లకి రెమ్యూనరేషన్ విషయంలో చాలా తేడా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.