జగన్ సర్కారుపై జబర్దస్త్ అప్పారావు ఆసక్తికర వ్యాఖ్యలు..వైరల్ అవుతున్న వీడియో..!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయమే కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో అప్పారావు కూడా ఒకరు నటన మీద ఉన్న ఆసక్తి వల్ల నాటకాలు వేస్తూ సినిమాలలో నటిస్తూ జీవనం సాగిస్తున్న అప్పారావు జబర్దస్త్ లో అవకాశం దక్కించుకొని కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. అయితే కొన్ని కారణాలవల్ల అప్పారావు కొంతకాలంగా జబర్దస్త్ లో కనిపించడం లేదు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇటీవల జగన్ సర్కారికి మద్దతుగా అప్పారావు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అప్పారావు స్వస్థలం విశాఖ పట్నం జిల్లాలోని అక్కాయపాలెం. విశాఖ వాసి అయిన అప్పారావు మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల15న విశాఖపట్నంలో జరిగే విశాఖ గర్జన అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఒక వీడియో పోస్ట్ చేశాడు. విశాఖను పరిపాలన రాజధాని చేయటం కోసం చేస్తున్న ఈ విశాఖ గర్జనకు అందరూ హాజరై దాన్ని విజయవంతం చేయాలని కోరాడు. ఈ కార్యక్రమంలో పాల్గొని దానిని విజయవంతం చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాడు.

ఇలా జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు అప్పారావు మద్దతు ఇవ్వటంతో జగన్ వైసీపీ కార్యకర్తలు జగన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మూడు రాజధానుల పై వ్యతిరేకత చూపిస్తున్న మరి కొంతమంది మాత్రం అప్పారావు మీద విమర్శలు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. జబర్థస్త్ లో కామెడీ చేసుకొని జీవించకుండా ఈ గోల నీకెందుకు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఇటీవల జగన్ సర్కారుకి మద్దతు తెలుపుతూ అప్పారావు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో రాజకీయా వర్గాల్లో కూడా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.