ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఈ మధ్య కాలంలో ఉద్యోగులకు వరుస షాకులు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే ఎన్నో షాకులిచ్చిన జగన్ సర్కార్ తాజాగా మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమైందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గ్రామ, వార్డ్ సచివాలయాలలో కొంతమంది ఉద్యోగులు సరిగ్గా పని చేయడం లేదు.
ఉద్యోగులు సరైన సమయానికి సచివాలయాలకు హాజరు కావడం లేదని విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కొంతమంది ఉద్యోగులు సాయంత్రం ఉండాల్సిన సమయం వరకు ఉండటం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు చేసిన పనులను, ఆ పనులకు సంబంధించిన పూర్తి వివరాలను జగన్ సర్కార్ తెలుసుకునే పనిలో బిజీగా ఉందని సమాచారం అందుతోంది.
ప్రత్యేక వ్యవస్థ ద్వారా జగన్ సర్కార్ ఈ వివరాలను తెలుసుకోనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల విషయంలో జగన్ సర్కార్ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో రెవిన్యూ డివిజన్ కు ఒక్కో స్క్వాడ్ ఆఫీసర్ ను ప్రభుత్వం నియమిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఇప్పటికీ ప్రొబేషన్ రాలేదు.
ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుందో చూడాలి. ఉద్యోగులను ప్రభుత్వం భయపెడుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ ప్రణాళిక ఏంటో తెలియాల్సి ఉంది. జగన్ సర్కార్ ఉద్యోగులలో వ్యతిరేకతను పెంచుకోవడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో జగన్ సర్కార్ మారాలని కొంతమంది సూచనలు చేస్తున్నారు.