నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబు.. జగన్ సర్కార్ పగ తీర్చుకుంటుందా?

chandrababu

రాజకీయ నేతలు ఎల్లప్పుడూ ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా ఉండాలి. రాజకీయ నేతలే తప్పులు చేస్తే ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కందుకూరులో చోటు చేసుకున్న ఘటనలో చంద్రబాబు నిబంధనలను ఉల్లంఘించారని వెల్లడైంది. 46 మీటర్లు చంద్రబాబు ముందుకు వచ్చేశాడని స్వయంగా ఎస్పీ వెల్లడించడం గమనార్హం.

అయితే వైసీపీ పగ తీర్చుకోవాలని భావిస్తే మాత్రం ఇంతకు మించిన అద్భుతమైన అవకాశం అయితే ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబుపై పిచ్చయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. సాక్ష్యాధారాల ఆధారంగా పోలీసులు ఈ కేసు విషయంలో ముందుకు వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. జగన్ సర్కార్ కావాలనే టార్గెట్ చేస్తే మాత్రం చంద్రబాబు నాయుడుకు ఇబ్బందులు తప్పవు.

ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు బయటపడాలంటే కూడా చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. అయితే చంద్రబాబు విషయంలో జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తే కొంతమందిలో ఆయనపై వ్యతిరేకత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

కందుకూరు విషాద ఘటన ఏ పార్టీకి ప్లస్ అవుతుందో ఏ పార్టీకి మైనస్ అవుతుందొ చూడాల్సి ఉంది. కుటుంబానికి 2 కోట్ల రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ప్రముఖ నటి రోజా డిమాండ్ చేయడం గమనార్హం. చంద్రబాబు నాయుడు ఇకనైనా తను నిర్వహించే సభల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.