ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమం 11 వారాలను పూర్తిచేసుకుని 12వ వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలోకి ప్రతి సీజన్లోనూ సింగర్ ను పంపించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్లో సింగర్ రేవంత్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇలా సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈయన బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉండడమే కాకుండా ఎలాగైనా విజేతగా నిలబడాలని కసితో ఆట కొనసాగిస్తున్నారు.
ఈ విధంగా రేవంత్ హౌస్ లో కొనసాగుతూ ఉన్నారు అయితే ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సమయానికి తన భార్య అన్విత ఆరు నెలల గర్భిణి. ప్రస్తుతం ఈమెకు నెలలు కూడా నిండడంతో తన పక్కన తన భర్త లేరు అనే లోటును భరిస్తోందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన భర్తను తలుచుకొని ఈమె ఎంతో ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
అన్విత సోషల్ మీడియా వేదికగా తన భర్త రేవంత్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. నువ్వు నా పక్కన లేకపోవడం చాలా బాధగా ఉంది. నా పక్కన లేకపోవడంతో నాలో ఉన్న స్ట్రెంత్,స్మైల్ అన్ని కూడా వెళ్లిపోయాయి. ఇలాంటి క్రూషియల్ టైంలో నువ్వు నా పక్కన ఉండి ఉంటే చాలా బాగుండేది. నువ్వు మాత్రమే నాకు కావాలి కేవలం నువ్వు మాత్రమే.. నీ కోసమే ఎదురు చూస్తున్న అంటూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేయడంతో ఎంతోమంది ఈ పోస్ట్ పై స్పందించి ఇలాంటి సమయంలో మీరు ఆవేదన చెందకూడదు ధైర్యంగా ఉండండి తప్పకుండా రేవంత్ విజయంతో తిరిగి వస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.