రష్మీ ఈటీవీ కాకుండా ఇతర చానల్లో కనిపించక పోవడానికి ఇదే కారణమా?

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో యాంకర్ రష్మీ ఒకరు.కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఈమెకు మల్లెమాలవారు బుల్లితెరపై యాంకర్ గా అవకాశం కల్పించారు.ఇలా బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం ఈటీవీలో ఏకంగా మూడు షోలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే రష్మీ తన కెరియర్ మొదటి నుంచి కేవలం ఈటీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలకు మాత్రమే యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈమె ఏ ఇతర ఛానల్లోనూ యాంకర్ గా వ్యవహరించలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రష్మీకి ఇదే ప్రశ్న ఎదురైంది.ఇలా రష్మీ ఇతర ఛానల్లోనూ ఇతర కార్యక్రమాలలోను పాల్గొనక పోవడానికి గల కారణం గురించి ఈమె ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

ఇంటర్వ్యూ సందర్భంగా రష్మీ సమాధానం చెబుతూ…ఈటీవీలో తనకు కంఫర్ట్ ఉన్నంతకాలం కొనసాగుతానని ఎప్పుడైతే తనకు సౌకర్యవంతంగా ఉండదో ఆ క్షణం తాను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతానని చెప్పారు. ఇలా సౌకర్యంగా ఉన్నంతవరకు అక్కడే కొనసాగుతానని అనంతరం ఏ ఛానళ్లకు వెళ్ళకుండా పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అవుతానంటూ ఈమె తెలియజేశారు.ఎక్కడో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటున్నటువంటి రష్మికి ఈటీవీ వాళ్ళు పిలిచి అవకాశం ఇప్పించడమే కాకుండా నేడు తనకి స్టార్ యాంకర్ గా హోదా కల్పించారు. ఈ క్రమంలోనే తాను చేస్తే ఈ టీవీ లోనే చేస్తానని తదుపరి ఏ ఛానల్ లకు వెళ్లకుండా పూర్తిగా ఇండస్ట్రీకే దూరమవుతానంటూ ఈమె చెప్పిన ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.