బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఆమెనే..? ముందే జోతిష్యం చెప్పేస్తున్న ప్రేక్షకులు…!

బుల్లితెర మీద ప్రసారమావుతున్న అతిపెద్ద రియాలిటీ షో అనగానే టక్కున గుర్తొచ్చే పేరు బిగ్ బాస్. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో తెలుగులో కూడా ప్రసారమాత ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల సెప్టెంబర్ నాలుగవ తేదీ ఆరవ సీజన్ ప్రారంభం అయింది. మొత్తం 21 మంది కంటెస్టెంట్లు ఈ సీజన్ 6 లో పాల్గొన్నారు. ఇప్పటికే ఈ ఆరవ సీజన్ ప్రారంభమై ఈరోజుతో రెండు వారాలు పూర్తవుతుంది. అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు అట్ట తీరును బట్టి ప్రేక్షకులు ముందుగానే సీజన్ సిక్స్ టైటిల్ విన్నర్ గురించి జ్యోతిష్యం చెప్పేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభమైన మొదటి రోజు నుండి ఇప్పటివరకు కొంతమంది కంటెస్టెంట్లు మాత్రమే బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో చురుగ్గా పాల్గొంటున్నారు.

ఆలాంటి వారిలో గీతు రాయల్ కూడా ఉంది. మొదటి రోజు నుండి తన యాసతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో గెలవటానికి ఎంతటికైన తెగిస్తోంది. ఇలా మొదటివారంలో ఎలిమినేషన్ కి సెలెక్ట్ అయిన గీతు అదృష్టం కొద్దీ బిగ్ బాస్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయడంతో బయటపడింది. ఇక రెండవ వారంలో బిగ్ బాస్ ఇచ్చిన సిసింద్రీ సిసింద్రీ టాస్క్ లో తన పనితనం చూపించి అందరి వద్ద ఉన్న బొమ్మలను లాక్కెళ్ళింది. ఇలా తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

దీంతో గీతు ఆడే ఆట తీరును చూసి ఈమె ఫైనల్ లో టాప్ ఫైవ్ లో ఉండటమే కాకుండ టైటిల్ కూడా సొంతం చేసుకుంటుందని ప్రేక్షకులు ముందే చెప్పేస్తున్నారు. అయితే రోజులు గడిచే కొద్దీ ఇంటి సభ్యుల పర్ఫార్మెన్స్ తో మార్పు ఉంటుందని…కేవలం రెండు వారాల ఆటతో గీతుని ఫైనల్ కంటెస్టెంట్ అనడం కూడా కరెక్ట్ కాదని మరికొంతమంది ప్రేక్షకులు భావిస్తున్నారు. గీతు టైటిల్ దక్కించుకోలేకపోయినా కూడా కచ్చితంగా ఫైనల్స్ లో టాప్ ఫైవ్ స్థానంలో ఉంటుందని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎవరు విన్నర్ అవుతారు ? ఎవరు ఫైనల్ కి వెళ్తారు ? అనేది తెలియాలంటే కొంత కాలం ఎదురుచూదాల్సిందే.