దీపావళి రోజున కాస్ట్లీ కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటోలు?

సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది తమ టాలెంట్ నిరూపించుకొని సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన హమీద కూడా ఒకటి రెండు సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల హమీద చాలా పాపులర్ అయింది. బిగ్ బాస్ హౌస్ లో సింగర్ శ్రీరామచంద్రతో కలిసి హమీద నడిపిన ప్రేమ వ్యవహారంతో ఈ అమ్మడు బాగా ఫేమస్ అయ్యింది. అంతేకాకుండా యాంకర్ రవితో కూడా చాలా సన్నిహితంగా మెలిగేది.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా హమీద శ్రీరామచంద్రతో కలిసి బయట తిరుగుతూ ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్లో కూడా పాల్గొనే అవకాశం దక్కించుకొని మరింత పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల హమీద పాపులర్ అవ్వటమే కాకుండా మంచి ఆదాయం మూట కట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హమీద తనకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంది.

తాజాగా దీపావళి పండుగ సందర్భంగా హమీద కొత్త కాస్ట్లీ కారు కొనుగోలు చేసింది. దీపావళి పండుగ రోజున ఖరీదైన మెర్సిడిస్‌ బెంజ్‌ కారును తన ఇంటికి తెచ్చుకున్న ఆమె.. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో హమీదా కుటుంబంతో పాటు యాంకర్‌ రవి, అతడి భార్య నిత్య సక్సేనా కూడా ఉన్నారు. ప్రస్తుతం హమీద షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక హమీదా పోస్టుకు శ్రీరామచంద్ర స్పందించి హమీద కి శుభాకాంక్షలు తెలియచేశాడు. దీనికి హమీద ‘థాంక్యూ’ అని రిప్లై ఇచ్చింది.