అత్తారింట్లో దీపావళి జరుపుకున్న జోర్దార్ సుజాత.. వైరల్ వీడియో?

జోర్దార్ సుజాత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అందరికీ ఎంతో సుపరిచితమే. ఈమె బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అనంతరం జబర్దస్త్ కార్యక్రమానికి కమెడియన్ గా పరిచయమయ్యారు. ఈ విధంగా లేడీ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన జోర్దార్ సుజాత ఎక్కువగా రాకింగ్ రాకేష్ టీమ్ లో సందడి చేశారు. ఇకపోతే వీరిద్దరి మధ్య ఎన్నో లవ్ స్కిట్ లలో చేశారు.అయితే ఇదంతా కేవలం స్కిట్ కోసమే అని భావించగా నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.

ఇకపోతే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలియడంతో వీరి ప్రేమకు ఇద్దరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న రాకేష్ సుజాత ఇద్దరు కూడా తమ స్నేహితులతో కలిసి పలు ప్రదేశాలను పర్యటిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.ఇకపోతే జోర్దార్ సుజాత జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

తాజాగా ఈమె దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.అయితే ఈమె ఇంకా పెళ్లి చేసుకొని రాకేష్ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టకు ముందే దీపావళి పండుగను తన అత్తగారింట్లో జరుపుకున్నారు. రాకేష్ తల్లి తన కాబోయే కోడలితో దీపావళి పండుగకు లక్ష్మీదేవి పూజను చేయించారు. ఈ విధంగా రాకేష్ సుజాత ఇద్దరు కలిసి లక్ష్మీ పూజను నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇలా పెళ్లి కాకుండానే అత్తారింట్లో లక్ష్మీ పూజ చేయిస్తూ దీపావళి పండుగను జరుపుకున్నారు.