జబర్దస్త్ లో ప్రవీణ్ రెమ్యునరేషన్ మరీ ఇంత తక్కువా..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్ ఫేమస్ అయ్యి ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్నారు. పేదరికంలో పుట్టి తినటానికి తిండి లేని ఎంతోమంది టాలెంట్ ని గుర్తించి వారికి మూడు పూటలా భోజనం పెట్టడమే కాకుండా ఆర్థికంగా కూడా ఎదగటానికి మల్లెమాల ప్రొడక్షన్ ఎంతగానో సహాయపడుతోంది. ఇలా ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ షో ద్వారా గుర్తింపు పొందిన ఎంతోమంది జబర్దస్త్ లో అవకాశాలు అందుకుంటున్నారు. పటాస్ ద్వారా గుర్తింపు పొందిన ప్రవీణ్, ఫైమా వంటి వారు కూడా ఇప్పుడు జబర్దస్త్ లో రెగ్యులర్ కంటెస్టెంట్లుగా గుర్తింపు పొందారు.

పటాస్ ద్వారా ఫేమస్ అయిన ప్రవీణ్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో తరచూ సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం రాకింగ్ రాకేష్ టీమ్ లో మెయిన్ కంటెస్టెంట్ గా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జబర్థస్త్ లో ప్రవీణ రెమ్యూనరేషన్ కి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జబర్దస్త్ కి వచ్చిన మొదట్లో ఒకరోజు కాల్ షీట్ కోసం ప్రవీణ్ 1000 నుండి 1500 రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకునేవాడు.

కానీ ఇప్పుడు రాకేష్ టీమ్ లో మెయిన్ లీడ్ గా చేయటం వల్ల రాకేష్ కి గుర్తింపు లభించడమే కాకుండా రెమ్యూనరేషన్ కూడా కొంతవరకు పెరిగినట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ లో ఒకరోజు ఎపిసోడ్ కోసం ప్రవీణ్ కి మల్లెమాలవారు కేవలం 5000 రూపాయలు మాత్రమే పారితోషికం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ ద్వారా ప్రవీణ్ నెలకు 50 నుండి 60 వేల వరకు మాత్రమే పారితోషికం అందుకుంటున్నాడు. అయిన జబర్థస్త్ లో పాపులారిటీని బట్టి రెమ్యునరేషన్ ఉంటుంది.