ఆది జబర్దస్త్ మానేయడానికి తనే కారణమా… మొత్తానికి బయటపెట్టిన ఆది!

బుల్లితెర కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. మధ్యలో ఓసారి ఈయన ఈ కార్యక్రమం నుంచి తపుకున్నా తిరిగి వచ్చారు. కానీ గత కొన్ని వారాలుగా మరోసారి జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకున్న శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలలో సందడి చేస్తూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు. ఇక ఈయన పాల్గొన్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ కమెడియన్ల అందరూ కూడా ఎంతో అద్భుతమైన పర్ఫామెన్స్లు చేస్తూ అందరిని సందడి చేశారు.సంక్రాంతి శుభాకాంక్షలు పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ కార్యక్రమం ప్రోమోలో భాగంగా హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణాన్ని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పెదరాయుడు గెటప్ లో సందడి చేసిన హైపర్ ఆదిని రష్మీ ప్రశ్నిస్తూ ఎందుకు మీరు జబర్దస్త్ వదిలి వచ్చారు అంటూ యాంకర్ సౌమ్యరావు ఫోటోతో పాటు మరో ఇద్దరి ఫోటోలను కూడా రష్మీ చూపించారు.

ఈ క్రమంలోనే యాంకర్ సౌమ్యరావు ఫోటోని చూపిస్తూ నేను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణం యాంకర్ సౌమ్యరావు అంటూ సమాధానం చెప్పారు. ఆది సౌమ్య రావే కారణమంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసాయి.అయితే సౌమ్య రావు వల్ల నిజంగానే హైపర్ ఆది ఆ కార్యక్రమాన్ని వదిలారా లేదంటే ప్రోమో కోసమే ఇలా కట్ చేశారా అనే విషయం తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి.