నేను అనాధను నాకు ఎవరూ లేరు.. జబర్దస్త్ కొత్త యాంకర్ కన్నీటి కష్టాలు మామూలుగా లేవు?

జబర్దస్త్ యాంకర్ గారు అనసూయ ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని వెండి తెరపై కూడా అవకాశాలు అందుకున్నారు. ఇలా వెండితెరపై ఎంతో బిజీగా కడుపుతో ఉన్నటువంటి అనసూయ చివరికి జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి అనసూయ తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి సౌమ్యరావు అనే కొత్త యాంకర్ వచ్చారు.ఈమె జబర్దస్త్ కార్యక్రమాని కంటే ముందుగా కన్నడ తమిళ్ బుల్లితెర సీరియల్స్ లో నటించే సందడి చేశారు అదేవిధంగా తెలుగులో కూడా శ్రీమంతుడు అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇలా ఈ టీవీ సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి సౌమ్యరావు ఓ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ అయినటువంటి హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ పై తనదైన స్టైల్ లో పంచ్ డైలాగులు వేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. అయితే జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా సౌమ్య రావు కరెక్టుగా సరిపోతుందని భావించడం మల్లెమాలవారు ఈమెను ఈ కార్యక్రమానికి యాంకర్ గా తీసుకువచ్చారు.

ఈ క్రమంలోనే గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సౌమ్యరావును యాంకర్ ప్రదీప్ మీ గురించి ఏమైనా చెప్పండి అంటూ ప్రశ్నించగా తాను ఒక అనాధనని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. తనకు తల్లి లేదని తండ్రున్నా కూడా వేస్ట్ అని ఈమె తెలిపారు.అందరిలాగా తనకు ఒక మంచి తల్లి తండ్రి అక్క చెల్లెల్లు అన్నదమ్ములు ఎవరూ లేరని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.అందరిలాగే తనకు ఒక మంచి సోదరుడు సోదరి లేక తల్లి ఉంటే తను కూడా ఎంతో హ్యాపీగా ఉండేదాన్ని అంటూ ఈ సందర్భంగా ఈమె తన గురించి చేసినటువంటి ఈ కామెంట్ వైరల్ అవుతున్నాయి.