సింగర్ రేవంతుకు గట్టి పోటీ ఇస్తున్న కంటెస్టెంట్ అతనేనా.. శ్రీహన్ ను వెనక్కి నెట్టి మరీ ?

బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఎంతో రసవతరంగా కొనసాగుతుంది.ఈ కార్యక్రమం ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకొని ఆరవ వారంలోకి అడుగు పెట్టింది ఇకపోతే ఈ కార్యక్రమంలో మొత్తం 21 మంది కంటెస్టెంట్ లో ఉండగా వీరిలో రేవంత్ మొదటి నుంచి ఓట్ల విషయంలో దూకుడు ప్రదర్శిస్తూ మొదటి పొజిషన్లో ఉన్నారు. సింగర్ రేవంత్ కు శ్రీహాన్ పోటీ ఇస్తూ తర్వాత స్థానంలో ఉన్నారు. అలాగే మధ్యలో గీత రాయల్ కూడా భారీగా పోటీపడింది.ఈ మధ్యకాలంలో గీత నోటి దూల అధికమవడంతో ప్రేక్షకులు ఈమె పైత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇకపోతే కామన్ మాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు కంటెస్టెంట్ ఆదిరెడ్డి. ఆదిరెడ్డి కామన్ మ్యాన్ గా హౌస్ లోకి వెళ్లినప్పటికీ ఎంతో అద్భుతమైన ఆట తీరును కనభరుస్తున్నారు. ఇక ఈయన సమయం దొరికినప్పుడల్లా తన దూకుడు ప్రదర్శిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా గత రెండు వారాల నుంచి ఆదిరెడ్డి కూడా ఓట్ల విషయంలో ముందంజలో ఉన్నారు. ఏకంగా శ్రీహాన్ ను వెనక్కి నెట్టి మరి ఈయన రేవంతకు గట్టి పోటీ ఇస్తున్నారు.

ఈ విధంగా ఆదిరెడ్డి పర్ఫామెన్స్ చూస్తుంటే ఈయన టాప్ పొజిషన్ వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆదిరెడ్డి టాప్ ఫైవ్ లో కూడా ఉండబోతున్నారని చాలామంది అభిప్రాయాలను చేస్తున్నారు.అయితే ఇదివరకు యూట్యూబ్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా సోషల్ మీడియాలో మూడు లక్షల వరకు ఫాలోవర్స్ ఉన్నటువంటి ఆదిరెడ్డిని కామన్ మ్యాన్ క్యాటగిరి ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. అయితే కామన్ మ్యాన్ ఎక్కువ వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగరు. మరి ఆదిరెడ్డి ఎన్ని వారాలపాటు హౌస్ లో కొనసాగుతారో తెలియాల్సి ఉంది.