మొదటి రోజే నోరు జారిన సింగర్ రేవంత్… వెనకేసుకొస్తున్న ఫ్యాన్స్?

ప్రేక్షకులు ఎంత కాలంగా ఎదురు చూస్తున్నా బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఇటీవల ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 4వ తేదీ ఆదివారం ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం 21 మంది కంటెస్టెంట్ లో పాల్గొన్నారు. వీరిలో చాలామంది బుల్లితెరకు సంబంధించిన నటి నటులు ఉన్నారు. ఇక ఈ షో లో ప్రముఖ సింగర్ రేవంత్ కూడా కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. సింగర్ గా మంచి గుర్తింపు పొందిన రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడంతో అతని మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ షో ప్రారంభమైన మొదటి రోజు నుండే బిగ్ బాస్ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో గీతు రాయల్స్ అందరికీ పని చెబుతు కొంచం ఓవర్ చేసినట్టు కనిపించింది. అలాగే ఇనాయా సుల్తానాని రైమ్ పాడమని ఆర్డర్ వేసింది. దీంతో ఇనాయా నువ్వు చెప్పిన పని మాత్రమే చేయాలి అంతే కానీ నువ్వు ఇలా రైమ్స్ పాడమంటే నేను పాడను అంటూ గీతూతో గొడవ పెట్టుకుంది. ఇలా షో ప్రారంభమై రెండు రోజులు కూడా గడవకుండానే బిగ్ బాస్ హౌస్ లో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. ఇక సింగర్ రేవంత్ కూడా ఏం మాట్లాడుతున్నాడో? ఎలా ప్రవర్తిస్తున్నాడో? ఎవరికి అర్థం కావడం లేదు. ఒకానొక సమయంలో రేవంత్ నోటి వెంట బూతులు కూడా వచ్చాయి. కానీ వెంటనే ఈ విషయం గ్రహించిన రేవంత్ తనదే పొరపాటు అన్నట్లు నాలుక్కరుచుకుని సారీ చెప్పాడు.

అయితే రేవంత్ ప్రవర్తన పట్ల నెటిజన్స్ ఆగ్రహాం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌజ్ లోకి రానంతవరకు రేవంత్ అంటే అందరికీ చాలా ఇష్టం అభిమానం ఉండేది. కానీ ఇలా బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టిన రేవంత్ తనకి బిగ్ బాస్ షో గురించి తెలియదని, ఇక్కడికి వచ్చిన తోటి కంటెస్టెంట్లు ఎవరో తెలియదంటూ వింతగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన రెండు రోజుల్లోనే నెటిజన్స్ నుండి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే కొందరు రేవంత్ అభిమానులు మాత్రం అతని వెనకేసుకు వస్తున్నారు. అతడు కొంత కన్‌ఫ్యూజ్‌ అవుతున్నాడని, బిగ్‌బాస్‌ ఇంట్లో సర్దుకోవడానికి కొంత టైం పడుతుందంటూ రేవంత్ ని వెనకేసుకువస్తున్నారు.