వామ్మో బూతులతో రెచ్చిపోయిన రేవంత్…మరి ఇంత దిగజారిపోయాడేంటి..?

ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఇప్పటికే రెండు వారాలు పూర్తిచేసుకుని మూడవ వారం కొనసాగుతోంది. మూడవ వారంలో ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ కూడా పూర్తి అయ్యాయి. ఇక ఈవారం కెప్టెన్సీ పదవి కోసం బిగ్ బాస్ అడవిలో ఆట అనే ఒక టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో భాగంగా కొంతమంది కంటెస్టెంట్ లో దొంగలుగా మారి అడవిలో ఉన్న వస్తువులు దొంగలించగా మరి కొంతమంది పోలీసులు వారిని అడ్డుకోవాలి. ఈ ఆటలో కంటెస్టెంట్లు బాగా రెచ్చిపోయారు ఆదివారం నాగార్జున పీకిన క్లాస్ కి ప్రతిఫలంగా ఈ టాస్క్ లో ఒక్కొక్కరు రెచ్చిపోయి తమ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు.

ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఆరోహి కాలికి దెబ్బ తగిలి కింద పడిపోయింది. దీంతో ఆమెను హౌస్ లోకి తీసుకెళ్లిపోయారు. అయితే ఎప్పుడు టంగ్ స్లిప్ అయ్యి తర్వాత నేను అనలేదు అంటూ మాట్లాడే
ఇనయా ఈ సారి కూడా సింపతి గేమ్ అంటూ నోరు జారింది. దీంతో సత్య కల్పించుకొని నిజంగానే ఆమెకి దెబ్బ తగిలింది అని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగకుండా లాగింది వాడే గా అంటూ శ్రీహాన్ మీద ఫైర్ అయ్యింది.

ఇనయా వాడు అని అనగానే శ్రీహాన్ కోపంతో ఊగిపోతూ ”వాడు ఏంటే వాడు” అంటూ ఇనయా మీద సీరియస్ అయ్యాడు. దీంతో రేవంత్ కల్పించుకుని ” మొన్న నన్ను కూడా అలాగే వాడు అని అనింది. అప్పుడే లాగి కోయాల్సిందంటూ అంటూ పచ్చి బూతులు మాట్లాడాడు. దీంతో ఇనయా కూడా ఏ మాత్రం తగ్గకుండా ఏంటి కొడతవా అంటూ రేవంత్ ని మరింత రెచ్చగొట్టినట్టు మాట్లాడింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యుల మద్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే రేవంత్ ప్రవర్తనకి నాగార్జున ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.