పొగరు చూపించటానికి చౌదరి అన్న తోక తగిలించుకున్నావా..నేహా చౌదరిని అవమానించిన యాంకర్?

నేహా చౌదరి..గతంలో ఈ పేరు గురించి అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం నేహా చౌదరి అంటే తెలియని వారంటూ ఉండరు. మొదటగా యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన స్నేహ చౌదరి ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో స్పోర్ట్స్ యాంకర్ గా గుర్తింపు పొందింది. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది ఫిమేల్ యాంకర్స్ ఉన్నప్పటికీ స్పోర్ట్స్ యాంకర్ మాత్రం నేహా చౌదరి మాత్రమే. ఇలా స్పోర్ట్స్ యాంకర్ గా గుర్తింపు పొందిన నేహా చౌదరి ఇటీవల బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది.

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన నేహా చౌదరి తను అగ్రకులంలో పుట్టినా కూడా అవమానాలు పాలైనట్లు చెప్పుకొచ్చింది.నా పేరు వెనుక చౌదరి అని ఉన్నందుకు ఒక ఛానల్లో పనిచేసే సీనియర్ యాంకర్ దారుణంగా అవమానించాడని చెప్పుకొచ్చింది. ఒక టీవీ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్న సమయంలో మేకప్ వేసుకుంటుండగా అక్కడ పని చేసే ఒక సీనియర్ యాంకర్ వచ్చి తనతో చాలా దురుసుగా ప్రవర్తిస్తూ… ఇక్కడికి ఎందుకు వచ్చావు. మీ వాళ్ళ చానల్స్ చాలా ఉన్నాయి.. అక్కడికి వెళ్లి అని తిట్టటమే కాకుండా నీ పొగరు చూపించటానికి పేరు వెనకాల చౌదరి అని తోక పెట్టుకున్నావా? అంటూ అవమనించినట్లు చెప్పుకొచ్చింది.

అతను సీనియర్ యాంకర్ కావటంతో అతనిని ఏమీ అనలేక అక్కడి నుండి బయటకి వచ్చి అమ్మకి ఫోన్ చేసి ఎడ్చినట్లు చెప్పుకొచ్చింది. ఇలా అగ్ర కులంలో పుట్టినా కూడా పేరు వెనకాల చౌదరీ అని పెట్టుకున్నందుకు దారుణంగా అవమానించారని నేహా తన బాధని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఏమి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.