ఢీ 14 కోసం ఆది కన్నా అఖిల్ రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..?

ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో ఎన్నో ఏళ్లుగా ప్రసారమవుతు ఎంతోమంది కొరియోగ్రాఫర్లను ఇండస్ట్రీకి అందించింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్న జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వంటి ఎంతో మంది ఢీ ద్వార గుర్తింపు పొందారు. ఇప్పటికే 13 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ డాన్స్ షో ప్రస్తుతం ఢీ 14 సీజన్ నడుస్తోంది. ఇదివరకు ఈ షో లో సుధీర్, రష్మి మెంటర్స్ గా ఉండేవారు. కానీ ఇపుడు ఆది, అఖిల్ వంటి వారు ఢీ షో లో సందడి చేస్తున్నారు. బిగ్ బాస్ ద్వార గుర్తింపు పొందిన అఖిల్ ఢీ 14 లో మెంటర్ గా అవకాశం దక్కించుకున్నాడు.

ఇక ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కామెడీ పంచులతో జబర్దస్త్ స్థాయిని పెంచిన ఆది ఇప్పుడు ఢీ 14 లో సందడి చేస్తున్నాడు.
అఖిల్ ఇటీవల బిగ్ బాస్ ఓటిటి లో పాల్గొనడం వల్ల కొంతకాలం ఢీ లో కనిపించలేదు. కానీ రెండు వారాలుగా మళ్ళి ఈ షో లో సందడి చేస్తున్నారు. సాధారణంగా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన వారిని మల్లెమాలవారు మళ్లీ లోపలకి రానివ్వరు. కానీ అఖిల్ మాత్రం బిగ్ బాస్ నుండి బయటికీ వచ్చిన కొంత కాలానికే ఢీ లో మళ్లీ అవకాశం దక్కించుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ డాన్స్ షో లో ఆది, అఖిల్ తీసుకునే రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన ఆది ఢీ 14 కోసం ఏకంగా జడ్జ్ లతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్క కాల్ షీట్ కోసం ఆది దాదాపు 5 లక్షలవరకు రెమ్యునరేషన్ అందుంకుంటున్నాడు. కానీ బిగ్ బాస్ ద్వారా గుర్తింపు పొందిన అఖిల్ రెమ్యునరేషన్ మాత్రం చాలా తక్కువ అని తెలుస్తోంది . బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఒక వారానికి అఖిల్ దాదాపు రెండున్నర లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకునేవాడు. కానీ ఇప్పుడు ఈ ఢీ 14 లో ఒక కాల్ షీట్ కి కేవలం లక్షన్నర మాత్రమే తీసుకుంటున్నాడు. ఈ షో లో పార్టిసిపేట్ చెసే కంటెస్టెంట్లు కూడా దాదాపు లక్ష వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇలా ఆదితో పోల్చితే అఖిల్ రెమ్యూనరేషన్ దాదాపు నాలుగు లక్షల రూపాయలు తక్కువ.