సినీ ఇండస్ట్రీలో గిల్లితే గిల్లించుకోవాలి… సంచలన వ్యాఖ్యలు చేసిన జబర్థస్త్ యాంకర్?

ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించిన అనసూయ ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు పొందింది. మొదట న్యూస్ ప్రజెంటేటర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనసూయ జబర్దస్త్ లో యాంకర్ గా అవకాశం పొందింది. ఈ షోలో అనసూయ యాంకరింగ్ తో పాటు ఆమె అందాలతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. దాదాపు 9 సంవత్సరాల పాటు అనసూయ జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగింది. ఈ క్రమంలో ఆమెకు సినిమా అవకాశాలు ఎక్కువగా రావటంతో ఇటీవల జబర్దస్త్ కి స్వస్తి చెప్పింది.

రంగస్థలం, పుష్ప , క్షణం వంటి సినిమాలలో వైవిద్యమైన పాత్రలలో నటించిన అనసూయ ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషలలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలో జబర్దస్త్ కి సమయం కేటాయించడం కుదరకపోవడంతో జబర్దస్త్ కి దూరమైంది. జబర్దస్త్ నుండి బయటికి వచ్చిన తర్వాత తాజాగా అనసూయ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఎప్పుడు ముక్కు సూటిగా మాట్లాడే అనసూయ ఈ ఇంటర్వ్యూలో జబర్దస్త్ గురించి సినీ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీతో హీరోయిన్స్ కి అసలు విలువ ఉండదని.. హీరోయిన్స్ ని చులకనగా చూస్తారు అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

ఇండస్ట్రీలో హీరోయిన్‌ అంటే కెమరా ముందు కాపాడండి అనే డైలాగ్ చెప్పాలి లేదంటే నవ్వుతూ సిగ్గుపడుతూ ఉండాలి. హీరోయిన్లుగా అదే మా పని. పోకిరి సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలి అనే డైలాగ్‌ ఉంది కదా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి అలానే ఉంటుంది. ఒకవేళ మా హక్కుల కోసం మాట్లాడితే మాపై వారికి ఇంట్రస్ట్‌ పోయి అవకాశాలు ఇవ్వరు. ఇండస్ట్రీలో హీరోయిన్‌ అంటే దేవదాసిలా పని చేయాలి అన్నట్లు చూస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలా ముక్కుసూటిగా మాట్లాడే తీరువల్ల అనసూయ తరచూ వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో నేను ఏమి మాట్లాడినా కూడా తప్పు పడతారు అలా అని మాట్లాడకపోయినా కూడా వేలెత్తి చూపుతారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.