తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రతి గురు శుక్రవారాలలో ప్రసారం అవుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తున్న షో జబర్దస్త్. కాగా ఈ షో ద్వారా ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఎంతోమంది జబర్దస్త్ షో ద్వారా భారీ పాపులారిటీని సంపాదించుకున్నారు. అలా సెలబ్రిటీ హోదాను దక్కించుకున్న వారిలో వర్ష, ఇమ్మాన్యుయేల్ జంట కూడా ఒకటి. మొదట కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇమ్మాన్యుయేల్ ఆ తర్వాత వర్షతో కలిసి లవ్ ట్రాక్ నడుపుతూ ఆన్ స్క్రీన్ జోడిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.
జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇవ్వకముందు వర్ష కూడా పలు సీరియల్స్ లో నటించినప్పటికీ రాని గుర్తింపు జబర్దస్త్ ద్వారా దక్కింది అని చెప్పవచ్చు. ఇక ఈ జంట ఆన్ స్క్రీన్ జోడిగా బాగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ జంటకు పెళ్లి చేయడంతో పాటు పలు స్పెషల్ పెర్ఫార్మన్స్ లలో ఇద్దరు కలిసి స్టెప్పులను ఇరగదీశారు. తెలుగు బుల్లితెరపై రష్మీ,సుధీర్ ల జంట తర్వాత ఆ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్నారు వర్ష,ఇమ్మాన్యుయేల్ జంట. కాగా ఎప్పటికప్పుడు వీరు స్టేజ్ పైనే ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా తాజాగా ఇమ్మాన్యుయేల్ తన యూట్యూబ్ ఛానల్ ఖాతా ద్వారా వర్ష తో షాపింగ్ చేసిన వీడియోని విడుదల చేశాడు. అంతేకాదండోయ్ డిసెంబర్ 25 వర్ష పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అదిరిపోయే సర్ప్రైజ్ ను ప్లాన్ చేశాడు ఇమ్మాన్యుయేల్. మొదటి షాపింగ్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఆ గిఫ్ట్ నీకే అంటూ ఆమెకు కాస్ట్లీ నెక్లెస్ ను కానుకగా ఇస్తే సర్ప్రైజ్ చేశాడు. ఇక వీడియో మధ్య మధ్యలో ఆమెపై సెటైర్లు వేస్తూ నవ్వించాడు. వర్ష,ఇమ్మాన్యుయేల్ ఇద్దరు కలిసి హైదరాబాదులోని ప్రముఖ జ్యువెలరీ షాప్ కు వెళ్లి ఒక కాస్ట్లీ నెక్లెస్ ని కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఇమ్మాన్యుయేల్ యూట్యూబ్ ఛానల్ ఖాతాలో వర్షతో కలిసి చేసిన మొదటి వ్లాగ్ వీడియో అని తెలిపాడు ఇమ్మాన్యుయేల్.