తన సీక్రెట్ లవ్ గురించి చెప్పి ఇమాన్యుల్ కి షాక్ ఇచ్చిన వర్ష..?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమీడియన్లుగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా ఈ షో కి రేటింగ్స్ రావటం కోసం మల్లెమాలవారు కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేసి ప్రేక్షకుల నుండి మంచి వ్యూస్ దక్కించుకుంటున్నారు. ఇలా మల్లెమాలవారు క్రియేట్ చేసిన జంటల్లో సుధీర్ రష్మీ జంట కూడా ఒకటి. వీరిద్దరూ ఇలా జంటగా చాలా ఫేమస్ అయ్యారు. అయితే ఇదంతా కేవలం షో కోసం మాత్రమే అని చెప్పినా కూడా ప్రేక్షకుల మాత్రం వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇలా సుధీర్ రష్మీ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు పొందిన జంటలలో ఇమాన్యుల్ వర్ష జంట కూడా ఒకటి.

రేటింగ్స్ కోసం మల్లెమాలవారు వీరిద్దరి మధ్య కూడా లవ్ ట్రాక్ క్రియేట్ చేశారు. దీంతో వీరిద్దరూ నిజమైన లవర్స్ లాగా ఆఫ్ స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ మీద ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వీరిద్దరికి జబర్దస్ స్టేజ్ మీద ఏకంగా పెళ్లి కూడా జరిపించేశారు. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారని ప్రేక్షకులు పొరపాటు పడ్డారు. కొంతకాలానికి సుధీర్ రష్మీ ఇలాగే మీరు కూడా షో కోసం మాత్రమే ఇలా నటిస్తున్నారని తేలిపోయింది. అయితే గత కొంతకాలంగా ఈ జంట గురించి విమర్శలు రావడంతో వీరిద్దరూ మునుపటిలా చనువుగా వ్యవహరించడం లేదు.

ఇదిలా ఉండగా ఇటీవల వర్ష తన లవ్ స్టోరీ గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఈవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వర్ష, ఇమాన్యుల్ ఇద్దరు సందడి చేశారు. ఈ క్రమంలో ‘అమ్మనా కోడలా’ పేరుతో స్పెషల్‌ ఎపిసోడ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా తమ మనసులో ఉన్న బాధని బయట పెట్టమని రష్మి అందరికీ చెబుతుంది . ఈ క్రమంలో వర్ష సైతం తన లవ్‌ స్టోరీ చెబుతూ… రీసెంట్‌గా మూడు నాలుగు నెలల నుంచి మేము సరిగా మాట్లాడుకోవడం లేదు అంటూ తన లవ్ స్టోరీ గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక వర్ష ఆ మాట చెప్పగానే పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది.