జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా గుర్తింపు పొందిన వారిలో వర్ష కూడా ఒకరు. జబర్దస్త్ లో తన కామెడీ పంచలతో పాటు అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వర్ష లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఇమాన్యుల్ తో ఉన్న లవ్ ఎఫైర్ వల్ల కూడా వర్షం మరింత పాపులర్ అయ్యింది. ఇమాన్యుల్ తో ఉన్న ఎఫైర్ వల్ల వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం వీరిద్దరూ కేవలం జబర్దస్త్ రేటింగ్స్ కోసం మాత్రమే ఇలా నటిస్తున్నారని ఇది ప్రేమని కొట్టిపారేస్తున్నారు.
అయితే ఇమ్మాన్యుల్ మాత్రం ఎప్పటికప్పుడు వర్షపై తనకి ఉన్న ప్రేమని తెలియజేస్తున్నాడు. ఇటీవల జబర్దస్త్ వేదికగా వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు వెల్లడించారు. అయితే అంతలోనే వర్ష పుట్టినరోజుకి ఇమాన్యుల్ ఒక ఖరీదైన అంతేకాకుండా వీరిద్దరూ కలిసి జబర్దస్త్ లో స్కిట్లు చేయటానికి కూడా వర్షా తల్లిదండ్రులుబంగారు హారాన్ని బహుమతిగా ఇచ్చాడు. దీంతో వీరిద్దరూ మల్లి కలిసిపోయినట్లు తెలుస్తోంది. ఇలా వీరిద్దరూ ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా చటాపటాలు వేసుకొని తిరుగుతూ క్లోజ్ గా ఉండటం వల్ల సోషల్ మీడియాలో వీరి జంట గురించి నెగటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎంతో అందంగా ఉండే వర్ష ఇమాన్యుల్ ని పెళ్లి చేసుకోవడం ఆమె అభిమానులకు ఏమాత్రం ఇష్టం లేదు. అందువల్ల వీరి జంట గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
అయితే వీరి జంట గురించి వస్తున్న విమర్శలు చూసిన వర్ష కుటుంబ సభ్యులు కూడా వీరిద్దరూ కలిసి ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా జబర్దస్త్ లో కూడా వీరిద్దరూ కలిసి స్కిట్ చేయడం వర్ష తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. ఇలా వీరిద్దరూ స్కిట్ లో కూడా జంటగా కనిపించటం ఇష్టంలేని వర్ష కుటుంబ సభ్యులు ఆమెను జబర్దస్త్ కి దూరం చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇమాన్యుల్ తో ఉన్న లవ్ ఎఫైర్ వల్ల వర్ష పాపులర్ అయినప్పటికీ అదే ఎఫైర్ వల్ల ఇప్పుడు జబర్దస్త్ కి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ… వర్ష జబర్దస్త్ కి దూరం కాకూడదని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.