ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యి కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ లో అవకాశం దక్కించుకొని కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందిన వారిలో ఇమాన్యుల్, నూకరాజు కూడా ఉన్నారు. వీరిద్దరూ చేసే కామెడీతో ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో మెయిన్ కమెడియన్లుగా కొనసాగుతున్నారు. చాలాకాలంగా జబర్దస్త్ లో సందడి చేస్తూ ప్రేక్షకులనే ఆకట్టుకుంటున్న వీరిద్దరి కూడా టీం లీడర్ గా మారే అర్హత ఉంది.
అయినప్పటికీ చాలా కాలంగా వీరిద్దరూ కేవలం జబర్దస్త్ లో కంటెస్టెంట్లు గానీ నటిస్తూ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు. జబర్దస్త్ కి వచ్చిన కొంతకాలానికి ఎంతోమంది టీం లీడర్లుగా ఎదిగి ఇప్పటికీ జబర్దస్త్ లో టీం లీడర్లుగా కొనసాగుతున్నారు. అయితే ఇంతలా కామెడీ చేసి అందరిని ఆకట్టుకుంటున్న వీరిద్దరూ టీం లీడర్లుగా కాకపోవడానికి కారణాలు ఉన్నాయని కొందరు జబర్దస్త్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. జబర్దస్త్ ప్రారంభమైన నాటినుండి కొంతకాలం క్రితం వరకు మంచి రేటింగ్స్ తో దూసుకుపోతూ బుల్లితెర మీద ప్రసారమవుతున్న నెంబర్ వన్ కామెడీ షో గా గుర్తింపు పొందింది.
అయితే గత కొంతకాలంగా జబర్దస్త్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో జబర్దస్త్ యాజమాన్యం వారు షో ప్రసారమయ్యే టైమింగ్స్ తగ్గించటమే కాకుండా జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండింటిలో టీమ్స్ ని కూడా తగ్గించారు. అంతే కాకుండా టీం లీడర్లకు రెమ్యూనరేషన్ తగ్గించడమే కాకుండా చాలా విషయాల్లో మల్లెమాల కాస్ట్ కట్టింగ్ చేస్తోంది. దీంతో షో రేటింగ్స్ పడిపోవటంతో జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ఉన్న టీమ్స్ ని తగ్గించటంతో వీరిద్దరికీ టీం లీడర్లుగా మారే అవకాశం రావడం లేదని కొందరు విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.