ఒక స్కిట్ కోసం రామ్ ప్రసాద్ తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

జబర్థస్త్ ద్వారా మల్లెమాల సంస్థ ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. ఊరు పేరు తెలియని ఎంతోమంది జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యి ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్స్ గా గుర్తింపు పొందటమే కాకుండా ఆర్థికంగా కూడా బాగా అభివృద్ధి చెందారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొంది పాపులర్ అయిన వారిలో రాంప్రసాద్ కూడా ఒకరు. సుధీర్, గెటప్ శ్రీను రాంప్రసాద్ ముగ్గురు కలిసి జబర్దస్త్ లో చేసే స్కిట్ లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. జబర్దస్త్ ద్వారా సుధీర్, శ్రీను ఎంత పాపులర్ అయ్యారు రాంప్రసాద్ కూడా అంతే పాపులర్ అయ్యాడు.

జబర్దస్త్ లో కి వచ్చిన తర్వాత రాంప్రసాద్ ఆర్థికంగా బాగా అభివృద్ధి చెంది ఆస్తులు సంపాదిస్తున్నాడు. దీంతో ప్రస్తుతం జబర్థస్త్ లో రాంప్రసాద్ రెమ్యునరేషన్ గురించి ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. రాంప్రసాద్ స్కిట్ లో నటించడమే కాకుండా ఆ స్కిట్ కి సంబంధించిన డైలాగులు కూడా రాస్తూ ఉంటాడు. ఇలా వారి స్కిట్ కి మాత్రమే కాకుండా ఇతర టీం లీడర్స్ కి కూడా స్కిట్లు రాస్తూ ఉంటాడు. అయితే జబర్థస్త్ లో ఒక స్కిట్ కి మల్లెమాల వారి రామ్ ప్రసాద్ కి రూ .1.50 లక్షలు పారితోషికం అందచేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతే కాకుండా ఇతర టీమ్ లీడర్స్ కి స్కిట్ రాసినందుకు కూడా అదనంగా సంపాదిస్తున్నాడు. ఇక రామ్ ప్రసాద్ జబర్థస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో కూడా సందడి చేస్తున్నాడు. ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ఈ షో లో కూడా ఆది , రామ్ ప్రసాద్ ఇద్దరు కలిసి స్కీట్లు చేస్తూ అందరినీ నవ్విస్తున్నారు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ షో కోసం కూడా మల్లెమాలవారు రాంప్రసాద్ కి మరింత అదనంగా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం.