రేవంత్ ఇలాగే హౌజ్ లో కొనసాగితే ఆయనకే కష్టం.. గీతు రాయల్

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 6 ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజన్ 6 లో ఉన్న సభ్యులందరూ తమ ఆటని షురూ చేశారు. ఈ సీజన్ మొదలై వారం రోజులు కూడా గడవకముందే ఇంట్లో ఉన్న సభ్యులందరూ తరచూ గొడవ పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్జీవి హీరోయిన్ ఇనయ సుల్తానా ప్రతి చిన్న విషయానికి అందరితో వాదిస్తూ కనిపిస్తోంది. ఇక హీరో ఆదిత్య ఇనయాని కన్విన్స్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. గడిచిన ఎపిసోడ్ లో కూడా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఓడిపోయినందుకు తనని ఎవరు సపోర్ట్ చేయటం లేదని ఇనయా రచ్చ చేసింది.

ఇకఈ వారం  ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ వారం ఎలిమినేషన్ లో 7 కంటెస్టెంట్ లు సెలెక్ట్ అవ్వగా వారిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వనున్నారు. ఇక గీతు రాయల్స్ కూడా ఛాన్స్ దొరికితే చాలు అందరితో చెడుగుడు ఆడుకుంటుంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఇనయా కి అడ్డమైన పనులు చెప్పింది. ఇక ఈ సీజన్ 6 మొదలైనప్పటి నుండి రేవంత్ ప్రతిరోజు హైలెట్ గా నిలుస్తున్నాడు. తన వాయిస్ తో అందర్నీ కంట్రోల్ చేయాలని చూసే రేవంత్ కొంతసేపటికి డల్ అయిపోయి ఎవరికీ కనిపించకుండా బాత్రూం ఏరియాకి వెళ్లి ఏడుస్తున్నాడు.

ఇక ఇటీవల నామినేషన్ ప్రక్రియలో రేవంత్ ని ఎక్కువమంది నామినేట్ చేయడంతో బాగా హార్ట్ అయినట్టు కనిపిస్తోంది. దీంతో మళ్లీ రేవంత్ డల్ అయిపోయి ఆలోచనలో పడ్డాడు. దీంతో ఆదిత్య నామినేట్ అయినంత మాత్రాన ఎవరూ మనల్ని బూతులు తిట్టుకోరు అంటూ రేవంత్ ని ఆ సిచువేషన్ నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఇక ఎప్పుడూ దూకుడుగా మాట్లాడే గీతు మాత్రం ఆయన ఈ బిహేవియర్ తో ఇలాగే హౌస్ లో కొనసాగితే మాత్రం ఒక పెద్ద సింగర్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అని ప్రేక్షకులు అనుకోవటం ఖాయం అందువల్ల అతను హౌస్ నుండి బయటకు వెళ్లడమే మంచిది అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. రేవంత్ బిహేవియర్ ఇలాగే కొనసాగితే మాత్రం ప్రేక్షకులు కూడా అతనిని కచ్చితంగా బయటికి పంపుతారనీ చెప్పారు.