కొంచెం సమయం దొరికితే తన ధ్యాస మొత్తం అక్కడే: గృహలక్ష్మి లాస్య

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ ప్రశాంతి ఒకరు.ఇలా యాంకర్ గా పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈమె ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లాస్య అనే విలన్ పాత్రలో ప్రశాంతి నటిస్తున్నారు. ఇలా బుల్లితెర సీరియల్ ద్వారా బిజీగా గడుపుతున్న ఈమె తాజాగా మరొక సీరియల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ప్రశాంతి ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను తెలియచేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు.తనకు కొంచెం సమయం దొరికితే తాను ఏం చేస్తారో అనే విషయాలను ఈ వీడియో ద్వారా వెల్లడించారు.ఒకప్పుడు కేవలం ఒక సీరియల్లో నటించడం వల్ల నెలలో 15 రోజులు ఆ సీరియల్ కోసం కేటాయించేదాన్ని అయితే ప్రస్తుతం రెండు సీరియల్స్ చేయటం వల్ల మరి కాస్త బిజీ అవుతానని ఈమె వెల్లడించారు.

ఇలా సీరియల్స్ ద్వారా బిజీగా గడుపుతూ ఉన్న తనకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన వెంటనే మేకప్ వేసుకొని అందంగా ముస్తాబయి ఫోటో షూట్ చేస్తుంటానని ఈ సందర్భంగా లాస్య తన ఖాళీ సమయంలో ఏం చేస్తారనే విషయం గురించి వీడియో ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక గృహలక్ష్మి సీరియల్ లో విలన్ పాత్ర ద్వారా ప్రశాంతి పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుందని చెప్పాలి.