ఇటీవల కాలంలో ఏ పెళ్లి వేడుకలో చూసిన తప్పనిసరిగా వినిపించే పాటలల్లో బుల్లెట్ బండి సాంగ్ ఒకటి. ఈ పాట ఎంతలా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ పాటలో నటించిన నటి జయంతి కూడా ఎంతో ఫేమస్ అయ్యారు. అయితే ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఒకప్పుడు వీడియో జాకీగా అందరిని ఎంతగానో సందడి చేసిన జయంతి కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఒకప్పుడు జెమినీ మ్యూజిక్ లో వెన్నెల అనే కార్యక్రమం ద్వారా జాకీగా అందరికీ పరిచయమైన జయంతి తన అందంతో మాటతీరుతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నారు. ఇలా జాకీగా ఎంతో సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అయితే నిర్మాతగా ఈమె తన సొంత నిర్మాణ సంస్థలో లచ్చి అనే హర్రర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా సినిమాకు నిర్మాతగా మాత్రమే కాకుండా హీరోయిన్గా కూడా నటించి సందడి చేశారు.
ఇలా తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమెను అప్పట్లో టాలీవుడ్ మాధురి దీక్షిత్ అంటూ కూడా అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జయంతి కొన్ని కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇలా గ్యాప్ తీసుకున్న ఈమె ప్రస్తుతం ఆల్బమ్ సాంగ్స్ ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
తాజాగా డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి అనే పాట ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జయంతి ఈ పాటలో అద్భుతమైన డాన్స్ చేస్తూ మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక ఈ పాట నివృత్తి వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలైంది ఇక ఈ పాట 2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం గమనార్హం.