ఆ అవమానం నాకింకా గుర్తుంది – హీరో నాని

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమాతో పాన్ ఇండియా హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డాడు అనేది సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతుంది. ఇప్పటికే ట్రైలర్ గా అతని కష్టం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇక ఓ యుట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరియర్ ఆరంభంలో ఎదుర్కొన్న కష్టాల గురించి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కెరియర్ ఆరంభంలో ఇండస్ట్రీలో ఏవైనా ఇబ్బందులు పడ్డారా అని అడిగిన ప్రశ్నకి నాని సమాధానం చెప్పారు. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా వచ్చాను. అసలు ఇక్కడ తనకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాను. అసలు ఏం జరుగుతుంది అనేది అర్ధమయ్యేది కాదు. చాలా మంది తిరస్కరణకి గురయ్యానని తెలిపారు. అయితే ఆరంభంలో సవాళ్లు అనేవి సర్వసాధారణం అని, వాటిని ఇప్పుడు చెప్పాలని అనుకోవడం లేదంటూ తేల్చేశారు.

అయితే ఇండస్ట్రీలో ఎంతో మందితో పోల్చుకుంటే తనకి కష్టాలు తక్కువని నాని పేర్కొన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటే, అందులో క్లాప్ అసిస్టెంట్ గా ఉంటే ఇంకా ఇబ్బందులు ఉంటాయని అన్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక అనేయోచ్చు అనే ఆలోచనతో ఉంటారని, అలాగే అవమానిస్తూ ఉంటారని అన్నారు. ఇలాంటి అవమానాలు ఎదుర్కోవడం తనకి అలవాటుగా మారిపోయిందని.

అయితే ఒక దర్శకుడు మాత్రం తనని దారుణంగా విమర్శించి, అందరి మధ్యలో అవమానకరంగా మాట్లాడారని అన్నారు. ఎప్పటికి నువ్వు డైరెక్టర్ కాలేవు అని అన్నాడని, ఆ మాటలు తనని ఎంతో ఆవేదనకి గురి చేశాయని నాని పేర్కొన్నారు. హీరోగా సక్సెస్ అయిన తర్వాత ఆ దర్శకుడిని ఓ సందర్భంలో కలిసానని, అప్పుడు కూడా అతని ఇగోలో ఎలాంటి మార్పు లేదని నాని చెప్పడం విశేషం. అయితే నానిని అంతగా కెరియర్ ఆరంభంలో ఆ దర్శకుడు ఎవరై ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.