నాకు ఇదివరకే పెళ్లయ్యింది… ప్రదీప్ షాకింగ్ కామెంట్స్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ యాంకర్స్ చాలామంది ఉన్నారు కానీ మేల్ యాంకర్స్ మాత్రం అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది మేల్ యాంకర్స్ లో ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు. ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా వ్యవహరిస్తున్న ప్రదీప్ సొంత నిర్మాణంలో టీవీ షోలు నిర్వహించి నిర్మాతగా కూడా మంచి గుర్తింపు పొందాడు. అంతేకాకుండా సినిమాలలో కూడా నటిస్తూ నటుడిగా కూడా తనకంటూ ఒక ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ప్రదీప్ యాంకరింగ్ విషయానికి వస్తే.. ఛానల్ తో సంబంధం లేకుండా అన్ని చానల్స్ లో దర్శనం ఇస్తూ సందడి చేస్తుంటాడు.

ఇక ఇటీవల దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ప్రదీప్ తనని తానే ఇంటర్వ్యూ చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రదీప్ కి సంబంధించిన అనేక విషయాలు బయటపడ్డాయి. అయితే ప్రదీప్ గురించి ఎప్పటినుండో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రదీప్ పెళ్లి వార్త ఎప్పుడు వైరల్ గా మారుతుంది. ఇక ఇటీవల నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కూడా ప్రదీప్ పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది.

ఈ కార్యక్రమంలో తనని తాను ఇంటర్వ్యూ చేసుకున్న ప్రదీప్ తన పెళ్లి గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలో నీకు నిజంగా పెళ్లయింది కదా? అని అడగ్గా.. ఇదివరకే నాకు నాలుగైదు సార్లు పెళ్లయిపోయింది యూట్యూబ్ లో చూడలేదా? అంటూ చాలా సిల్లీగా సమాధానం చెబుతూ తనపై తానే కౌంటర్లు వేసుకున్నాడు. అయితే ఎప్పటిలాగే ప్రదీప్ ఈసారి కూడా తన పెళ్లికి సంబంధించిన ప్రశ్నపై సరైన సమాధానం మాత్రం ఇవ్వలేదు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.