బిగ్ బాస్ షో నిలిపివేతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు…?

దేశంలో నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషలలో ప్రసారం అవుతుంది. ఇక తెలుగులో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రసారమవుతున్న ఈ బిగ్ బాస్ రియాలిటీ షో టెలివిజన్లో ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుని ఓటిటి లో కూడా ఒక నాన్ స్టాప్ సీసన్ పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల సెప్టెంబర్ 4వ తేదీన బిగ్ బాస్ ఆరవ సీజన్ కూడా ప్రారంభమై మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

అయితే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో మీద కొందరు రాజకీయ నాయకులు వ్యతిరేకత తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ అనేది రియాలిటీ షో కాదని..ఇది ఒక బూతు షో అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ షో నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇటీవల అడ్వొకేట్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా బిగ్ బాస్ షో కి వ్యతిరేకంగా షో నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. బిగ్ బాస్ రియాలిటీ షో లో అశ్లీలత ఎక్కువగా ఉందని.. ఈ షో సెన్సార్ లేకుండా ప్రసారమవుతోంది అంటూ వేసిన పిటిషన్ పై హైకోర్టు స్పందించింది.

కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ పై జస్టిస్‌ పికె మిశ్రా, జస్టిస్‌ డివిఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఇటీవల విచారణ జరిపింది. అందులో భాగంగా బిగ్‌బాస్‌ షోకు సంబంధించిన వివరాలను తమకు నివేదించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది కోర్టు. మరో రెండు మూడు ఎపిసోడ్లు చూసిన తర్వాత తీర్పు వెల్లడిస్తామని ఇక తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. ఇలా బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రారంభమైన నాటి నుండి రేటింగ్స్ తగ్గటమే కాకుండా ఇలా కోర్టు వివాదాలతో నడుస్తోంది. ఈ వివాదంపై కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందోనని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.